'సిగ్గుచేటు.. నారా లోకేష్‌ను చూసి బెదిరిపోతున్న వైయస్ జగన్, వైసిపి'
తమ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను చూసి వైసిపి నేతలు భయపడుతున్నారని టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు శుక్రవారం నాడు ఎద్దేవా చేశారు.
విజయవాడ: తమ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను చూసి వైసిపి నేతలు భయపడుతున్నారని టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు శుక్రవారం నాడు ఎద్దేవా చేశారు.
సొంత ఇంటినే అఫిడవిట్‌లో చూపించుకోలేని అవినీతిపరుడు జగన్ అన్నారు. జగన్ తన ఆస్తులను అసెంబ్లీకి తెలపకపోవడం చట్టాల ఉల్లంఘనే అని దుయ్యబట్టారు.
వైసిపి నేతలు హెరిటేజ్ సంస్థ గురించి మాట్లాడటం సిగ్గుచేటు అన్నారు. 2004కు ముందు, ఇప్పుడు జగన్‌కు, లోకేష్‌కు ఉన్న ఆస్తుల పైన చర్చకు సిద్ధమా అని బోండా ఉమ సవాల్ విసిరారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై రఘువీరా ఆగ్రహం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై మోయలేని భారాలు మోపుతున్నాయని ఏపీసీసీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి వేరుగా మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు మరిచిపోయి నిత్యావసరాల ధరలు అధికంగా పెంచేస్తన్నారన్నారు.
తూర్పు గోదావరి జిల్లాలోని ముంపు మండలాల పర్యటనకు వెళ్లేందుకు రాజమహేంద్రవరం విమానాశ్రయంలో దిగిన ఆయన మీడియాతో మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్‌లోని మూడో వంతు గ్రామ పంచాయతీల్లో ఇంటి పన్నులు విపరీతంగా పెంచేశారని ఆరోపించారు. పెంచిన పన్నులు తగ్గించేలా కాంగ్రెస్ తరపున ఆందోళన చేపడతామన్నారు.












Click it and Unblock the Notifications