ఎన్డీఏకు మద్దతు వెనుక - నెక్స్ట్ టార్గెట్ , ముఖ్య నేతలతో జగన్..!!

ఏపీ రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. వైసీపీ లక్ష్యంగా ఏపీలోని కూటమి రాజకీయ నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అధినాయకత్వం వైసీపీ మద్దతు కోరటం, జగన్ సానుకూలంగా స్పందించటం ఆసక్తి కరంగా మారింది. ఏపీలో ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు కావటంతో ఇక.. ప్రభుత్వం పైన పోరాటం తీవ్రత పెంచాలని జగన్ నిర్ణయించారు. ఈ మేరకు తాజాగా జరిగిన పార్టీ ముఖ్య నేతల సమావేశంలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. కొత్త కార్యాచరణ పైన దిశా నిర్దేశం చేసారు.

ఎన్డీఏకు మద్దతు
మాజీ ముఖ్యమంత్రి జగన్ పార్టీ ముఖ్య నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజా భేటీ లో రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ సమీకరణాలు.. చోటు చేసుకుంటున్న పరిణామాల పైన చర్చ జరిగింది. అందులో భాగంగా తాజాగా ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్ధికి వైసీపీ మద్దతు అంశం పైన జగన్ క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. కాంగ్రెస్ దేశ వ్యాప్తంగా ఓట్ల వివాదం పైన మాట్లాడుతున్నా.. ఏపీలో అంశం పైన మాట్లాడకపోవటం వెనుక కారణాలను మరోసారి ప్రస్తావించినట్లు సమాచారం. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా వైసీపీ ఏర్పాటు అయిందనే విషయాన్ని జగన్ గుర్తు చేసారు. దీంతో పాటుగా బీజేపీ ముఖ్య నేతలే మద్దతు అడిగారని.. ఎన్డీఏ అభ్యర్ధి గెలిచే అవకాశం ఉందని జగన్ చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో.. గెలిచే అభ్యర్ధికి మద్దతు ఇస్తున్నామని తేల్చి చెప్పారు.

ys-jagan-fixed-road-map-for-party-leaders-over-protests-against-govt-decisions

పెన్షన్ల తొలిగింపు
ఇదే సమయంలో ఏపీలో ప్రభుత్వం 15 నెలల పాలన పూర్తి చేసుకోవటంతో ఇక ప్రతిపక్ష పాత్ర మరింత సమర్ధవంతంగా పోషించాలని జగన్ పార్టీ నేతలకు సూచించారు. ప్రజల్లో ప్రభుత్వం పైన వ్యతిరేక పెరుగుతోందని మరోసారి జగన్ వివరించారు. పెన్షన్ల తొలిగింపు విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల పైన నిలదీయాలని జగన్ నిర్దేశించారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితులను గమనిస్తూ.. బాధితులకు అండగా నిలవాలని సూచించారు. బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ పేరుతో చేపట్టిన కార్యక్రమానికి ప్రజల నుంచి వచ్చిన స్పందన పైన చర్చించారు. అదే తరహాలో పెన్షన్ల తొలిగింపు పైన పోరాటానికి సిద్దం కావాలని జగన్ నిర్దేశించారు. రాష్ట్ర స్థాయిలో జరిగే ధర్నా లో తాను పాల్గొంటానని జగన్ చెప్పినట్లు తెలుస్తోంది.

ఇక జనంలోనే
ఇక రానున్న రోజుల్లో జనంతోనే ఉండేలా పార్టీ నేతలంతా సిద్దం కావాలని జగన్ సూచించారు. వచ్చే నెల సెప్టెంబర్ 1న ప్రభుత్వం పంపిణీ చేసే పెన్షన్లను పరిశీలించిన తరువాత.. పోరుబాట పైన నిర్ణయం తీసుకుందామని జగన్ వెల్లడించారు. అర్హులకు ఎవరికైనా పెన్షన్ తెలిగిస్తే వారి పక్షాన ఎక్కడికి అక్కడ నిలదీయాలని నిర్దేశించారు. అదే విధంగా దసరా తరువాత జిల్లాల వారీగా పర్యటనలు ప్రారంభించాలని సూత్ర ప్రాయంగా నిర్ణయించారు. పథకాలు అర్హులకు పూర్తి స్థాయి లో అందటం లేదని... నియోజకవర్గాల వారీగా నిర్ణయాలు తీసుకొని.. బాధితుల పక్షాన పార్టీ నిలబడాలని జగన్ సూచించారు. సెప్టెంబర్ 10,11 తేదీల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తల సమావేశం ఏర్పాటు కు నిర్ణయించారు. ఆ భేటీలో భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేయనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+