నారాయణ పై జగన్ మాస్టర్ స్కెచ్ - లెక్క మారుతోంది...!!
ఏపీలో ఎన్నికల రాజకీయ పోరు హోరాహోరీగా మారుతోంది . మూడు పార్టీల కూటమి వర్సెస్ వైసిపి పోరు పతాక స్థాయికి చేరింది. ముఖ్యమంత్రి జగన్ బస్సు యాత్ర రాయలసీమలో పూర్తయి నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించింది. ఈసారి నెల్లూరు జిల్లా రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. అక్కడ 2019 తరహా విజయం సాధించేందుకు జగన్ పావులు కదుపుతున్నారు. స్థానిక నేతలతో అన్ని నియోజకవర్గాలపై సుదీర్ఘ మంతనాలు చేశారు. నెల్లూరు నగరంలో మాజీ మంత్రి నారాయణ ఓటమి లక్ష్యంగా జగన్ మాస్టర్ స్కెచ్ సిద్ధం చేశారు.
హోరాహోరీ పోరు
ఈసారి నెల్లూరు జిల్లాలో టిడిపి వర్సెస్ వైసిపి మధ్య పోరు ఆసక్తికరంగా జరుగుతోంది. 2019 ఎన్నికల్లో వైసిపి మొత్తం పది స్థానాల్లోనూ విజయం సాధించింది. ఈసారి వైసీపీలో చోటు చేసుకున్న పరిణామాలతో సీఎం జగన్ అలెర్ట్ అయ్యారు. తాజాగా నెల్లూరు జిల్లాలో బస్సు యాత్ర సమయంలో పార్టీ ముఖ్యులతో సమావేశం అయ్యారు. ప్రత్యేకించి టిడిపి కీలక నేతలు పోటీ చేస్తున్న నియోజకవర్గాలపై ఫోకస్ చేశారు.

అందులో నెల్లూరు సిటీ నియోజకవర్గంలో వైసిపి వరుసగా రెండు సార్లు విజయం సాధించింది. రెండుసార్లు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వైసీపీ అభ్యర్థిగా గెలుపొందారు. ఈసారి నెల్లూరు సిటీ వైసిపి అభ్యర్థిగా మైనార్టీ వర్గానికి చెందిన ఖలీల్ అహ్మద్‌కు సీటు కేటాయించారు. 2019 ఎన్నికల్లో మాజీ మంత్రి నారాయణ అనిల్ చేతిలో ఓడిపోయారు.
జగన్ కొత్త స్కెచ్
తర్వాత ఎమ్మెల్సీగా చంద్రబాబు ప్రభుత్వంలో మున్సిపల్ మంత్రిగా వ్యవహరించారు. ఈసారి ఎలాగైనా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. స్థానికంగా జనసేనతో ఉన్న పొత్తు కూడా కలిసి వస్తుందని లెక్కలు వేస్తున్నారు. కానీ అక్కడే లెక్కలు మారుతున్నాయి. టిడిపి, జనసేన నుంచి ముఖ్య నేతలను తమ వైపు తిప్పుకునేందుకు వైసిపి ఆపరేషన్ ప్రారంభించింది.
నెల్లూరు నగరంలో అమలు చేసిన సంక్షేమం గురించి పార్టీ నేతలు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నారు. కరోనా సమయంలో నెల్లూరు నగరంలో అందించిన సాయం గురించి గుర్తు చేస్తున్నారు. నారాయణ పూర్తిగా డబ్బుతో రాజకీయం చేయాలని ప్రయత్నిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదే సమయంలో మైనార్టీ ఓట్ బ్యాంక్ పూర్తిగా వైసిపి వైపు టర్న్ అవుతున్నట్లు స్పష్టమవుతోంది.
మారుతున్న లెక్కలు
గతంలో వైసీపీలో పని చేసిన నేతలు ఇప్పుడు పార్టీ మారడంతో స్థానికంగా టిడిపి జనసేనకు జోష్ వచ్చినట్లు భావిస్తున్నా.. కార్యకర్తలు, ఓటర్లు మాత్రం వారిపట్ల విముఖంగా ఉన్నట్లు సర్వే నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో పాటుగా సామాజిక సమీకరణాలు, సంక్షేమ పథకాలు పూర్తిగా వైసిపికి అనుకూలంగా ఉన్నట్లు గుర్తించారు. నారాయణతో ప్రచారంలో పాల్గొంటున్న ముఖ్య నేతలతో ఇప్పటికే వైసీపీ టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తుంది. నెల్లూరు సిటీలో పరిస్థితుల పైన స్వయంగా సమీక్షించిన జగన్ కొందరు ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పగించారు.
ఎన్నికల సమయంలో నెల్లూరు సిటీ నియోజకవర్గంలో రాజకీయంగా అనూహ్య మార్పులు జరుగుతాయని వైసిపి నేతలు చెబుతున్నారు. తామే గెలుస్తామని టిడిపి ధీమా వ్యక్తం చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉన్నాయనేది స్పష్టం అవుతుంది. 2014లోనూ నారాయణ ఇదే తరహాలో గెలిచేశామని ప్రచారం చేసుకున్న విషయాన్ని సొంత పార్టీ నేతలే గుర్తు చేస్తున్నారు. దీంతో క్రమేణా మారుతున్న స్థానిక పరిస్థితులతో నారాయణ గెలుపు మీద కొత్త చర్చ మొదలైంది.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications