Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మళ్లీ తెరపైకి మూడు రాజధానులు ! పంద్రాగస్టు వేళ జగన్ ప్రస్తావన-అనుకూలంగా పరిస్ధితులు ?

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి స్ధానంలో మూడు రాజధానులకు పావులు కదిపింది. అయితే రైతుల అభ్యంతరాలతో హైకోర్టు దానికి బ్రేక్ వేసింది. అదే సమయంలో హైకోర్టు తీర్పును ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేయకపోవడంతో అనుమానాలు మొదలయ్యాయి. అవే నిజమైతే ఇప్పుడు కేంద్రంలో, సుప్రీంకోర్టులో తమకు అనుకూలమైన పరిస్ధితులు ఉన్నట్లు జగన్ సర్కార్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఇవాళ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో జగన్ మరోసారి మూడు రాజధానుల ప్రస్తావన తెచ్చారు.

 మళ్లీ మూడు రాజధానులు ?

మళ్లీ మూడు రాజధానులు ?

ఏపీలో మూడు రాజధానుల వ్యవహారంపై మూడేళ్లుగా చర్చ జరుగుతూనే ఉంది. కానీ ముందడుగు మాత్రం పడటం లేదు. ఇప్పటికే అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లుల్ని రెండుసార్లు పెట్టిన ప్రభుత్వం.. హైకోర్టు అభ్యంతరాలతో ఆ తర్వాత వాటిని వెనక్కి తీసుకుంది. చివరికి హైకోర్టు కూడా అమరావతినే రాజధానిగా ఉంచాలని తీర్పు కూడా ఇచ్చేసింది. దీంతో ఇక అమరావతితోనే రాజధాని ఉంటుందని భావిస్తున్న వారికి ప్రభుత్వం మరోసారి షాకిస్తోంది. ఇప్పటికే వైసీపీ నేతలు, మంత్రులు మూడు రాజధానుల చర్చను మరోసారి తెరపైకి తెస్తుండగా.. ఇవాళ సీఎం జగన్ కూడా ఇవే సంకేతాలు ఇచ్చేశారు.

పంద్రాగస్టు ప్రసంగంలో జగన్ సంకేతం

పంద్రాగస్టు ప్రసంగంలో జగన్ సంకేతం

మూడు రాజధానుల విషయంలో ప్రభుత్వ వైఖరి ఇప్పటికీ ఎవరికీ అంతుబట్టడం లేదు. ఓవైపు మూడు రాజధానులు ఖాయమంటూనే మరోవైపు అడుగులు ముందుకు పడకపోవడంతో జనంలో అనుమానాలు పెరుగుతున్నాయి. పాత రాజధాని అమరావతిని కాదని కొత్త రాజధానుల్ని అమల్లోకి తీసుకురాలేకపోతే వచ్చే ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవన్న సంకేతాలు వస్తున్నాయి. ప్రభుత్వం కూడా గతేడాదంతా పంద్రాగస్టు ప్రసంగాల్లో, రిపబ్లిక్ డే ప్రసంగాల్లో దీన్ని ప్రస్తావించలేదు. దీంతో అనుమానాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో జగన్ ఇవాళ మరోసారి మూడు రాజధానుల సంకేతాలు ఇచ్చారు.

 తమ విధానం ఇదేనన్న జగన్

తమ విధానం ఇదేనన్న జగన్

మూడు రాజధానులపై ఏడాది తర్వాత మాట్లాడిన జగన్.. పరోక్షంగానే సంకేతాలు ఇచ్చారు. రాజధాని స్థాయిలో పరిపాలనా వికేంద్రీకరణే తమ విధానమని జగన్ వెల్లడించారు. ప్రాంతీయ అసమానతలకు , అక్కడి వారి ఆకాంక్షలకు ఇదే పునాది అని స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో పేర్కొన్నారు. గతంలో ఎన్నికల హామీలు నెరవేర్చకుండా చేసిన నష్టాన్ని పరిపాలన అంటారా? అని కూడా జగన్ ప్రశ్నించారు. దీంతో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ విధానాన్ని జగన్ మరోసారి స్పష్టం చేసినట్లయింది.

 కలిసొస్తున్న పరిస్ధితులు ?

కలిసొస్తున్న పరిస్ధితులు ?

గతంలో మూడు రాజధానుల ఏర్పాటు సమయంలో కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు కలిగిన ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఢిల్లీలో ఉన్నారు. అలాగే జగన్ గతంలో ఫిర్యాదులు చేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ కూడా అక్కడే ఉన్నారు. దీంతో వీరిద్దరితో నేరుగా తలపడే ఉద్దేశం లేకే జగన్ మూడు రాజధానులపై వ్యూహాత్మకంగా వెనక్కి తగ్గారన్న ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు పరిస్ధితులు మారాయి. వీరిద్దరూ ఈ నెలలో రిటైర్ అవుతున్నారు. ఇప్పటికే వెంకయ్య రిటైర్ కాగా... ఎన్వీ రమణ కూడా వచ్చేవారం రిటైర్ కానున్నారు. దీంతో జగన్ మరోసారి తన మూడు రాజధానుల వ్యూహాన్ని తెరపైకి తెచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే ఇది అసెంబ్లీ ద్వారా చేస్తారా లేక సుప్రీంకోర్టులోనే సవాల్ చేస్తారా అన్నది తేలాల్సి ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+