Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జగన్ నమ్మకం వారి పైనే, కీలక నిర్ణయం - గేమ్ ఛేంజర్..!!

ముఖ్యమంత్రి జగన్ మేనిఫెస్టో ప్రకటించారు. నవరత్నాల కొనసాగింపుకు నిర్ణయించారు. కీలక నిర్ణయాలు ప్రకటించారు. తొలి నుంచి నమ్ముుకున్న మహిళా ఓట్ బ్యాంక్ ను మరింత బలోపేతం చేసుకొనేందుకు జగన్ ప్రాధాన్యత ఇచ్చారు. రైతు భరోసా పెంచారు. అమ్మఒడి మొత్తాన్ని పెంపుదలకు హామీ ఇచ్చారు. పెన్షన్లను పెంచేందుకు నిర్ణయించారు. చంద్రబాబు హామీలకు ఎంత ఖర్చు చేయాల్సి వస్తుందీ వివరించారు. జగన్ నమ్మకం గెలిపిస్తుందా.

మహిళకు ప్రాధాన్యత
జగన్ ఈ సారి పూర్తిగా మహిళలు, రైతుల పైనే నమ్మకం పెట్టుకున్నారు. 2019 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన సమయం నుంచి మహిళా ఓట్ బ్యాంక్ పైనే జగన్ ఫోకస్ చేసారు. అన్ని పథకాలకు మహిళ లకే ప్రకటించారు. తాజా ఎన్నికల సమయంలో మరోసారి మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే నిర్ణయాలు తీసుకున్నారు. విద్య, వైద్యంకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ప్రకటించారు. మహిళా సాధికారత కోసం వైయస్‌ఆర్‌ చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, సున్నా వడ్డీ కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. వైయస్‌ఆర్‌ పెన్షన్‌కానుక రెండు విడతల్లో రూ.3500పెంపుపై హామీ ఇచ్చారు. ఇంటి వద్దే వలంటీర్ల ద్వారా ఇంటి వద్దే పింఛన్ల పంపిణీ కొనసాగతుందని చెప్పారు. అదే సమయంలో అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని వెల్లడించారు.

YS Jagan Focus on Women and Farmer voting Give priority for Welfare Schemes in his manifesto

అమ్మ ఒడి పెంపు
మౌలిక వసతులు, సుపరిపాలన, నిర్మిస్తున్న నాలుగు పోర్టులు పూర్తి చేయడం, ఫిషింగ్‌ హార్బర్లు, ఎయిర్‌పోర్టు నిర్మాణాలు పూర్తి, ఇండస్ట్రీయల్‌ కారిడార్లు, నోడ్స్‌ పూర్తి, ప్రాధాన్యత క్రమంలో జలయజ్ఞం పూర్తి, గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తామని జగన్ హామీ ఇచ్చారు. వైయస్‌ఆర్‌ చేయూత కార్యక్రమం ఇప్పటి వరకు రూ.75 వేలు ఇచ్చామని.. దాన్ని కొనసాగిస్తమన్నారు. వైయస్‌ఆర్‌ కాపు నేస్తం తో పాటుగా..వైయస్‌ఆర్‌ ఈబీసీ నేస్తం రూ.1.05 లక్షలకు పెంపు పైన ప్రకటన చేసారు. అమ్మ ఒడి గతంలో రూ.15 వేలు ఇస్తుండగా..ఇప్పుడు. 17 వేలకు పెంపు..తల్లి చేతికే రూ.15 వేలు వెళ్తుందని చెప్పారు. మరో రూ.2 వేలు స్కూల్‌ మెయింటెన్స్‌ కోసం కేటాయిస్తాం. వైయస్‌ఆర్‌ ఆసరా కింద రూ.25,571 కోట్లు నాలుగు దఫాల్లో ఇవ్వగా..ఇది మరో ఐదేళ్లు కొనసాగుతుంది. వైయస్‌ఆర్‌ కళ్యాణమస్తు,షాదీ తోఫా ఈ ఐదేళ్లు కూడా కొనసాగుతుంది.

అర్హులందరికీ ఇళ్ల స్థలాలు
పేదలందరికీ ఇళ్ల పట్టాలు, ఇప్పటికే 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చామని.. ఇప్పటికే 22 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి అవుతున్నాయని జగన్ వెల్లడించారు అర్హులందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం కొనసాగుతోందిని.. మిగిలిన ఇళ్లు కూడా నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అవ్వాతాతలకు పింఛన్లు రూ.3500 పెంపుపై నిర్ణయం తీసుకున్నారు. 2028 జనవరిలో రూ.250, 2029 జనవరిలో రూ.250 పెంచుతాననని హామీ ఇచ్చారు. రైతులకు ఇచ్చే రైతు భరోసా సొమ్ము ఇప్పటికే రూ.65,500 ఇవ్వగలిగామన్నారు. ఈసారి రూ.16 వేలకు పెంచి ఐదేళ్లలో రూ.80 వేలు ఇవ్వబోతున్నట్లు జగన్ వెల్లడించారు. ఐదేళ్లలో 55 లక్షల మంది రైతుల సంక్షేమం కోసం ఈ కార్యక్రమం కొనసాగుతుందని హామీ ఇచ్చారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+