మా వాళ్లను వేధిస్తే ఊరుకోం: బాబుకు జగన్ హెచ్చరిక

కడప: అధికారం ఉంది కదా అని అక్రమ కేసులతో తమ పార్టీ కార్యకర్తలను వేధిస్తే ఊరుకునేది లేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఇతర తెలుగుదేశం పార్టీ నేతలను ఉద్దేశించి హెచ్చరించారు. ప్రతిపక్షంలో ఉన్న పోరాటం చేస్తామని చెప్పారు.

పులివెందులలోని బాకరాపురంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజలు, కార్యకర్తలను గురువారం కలిశారు. పులివెందుల మున్సిపాలిటీకి చెందిన పలువురు కౌన్సిలర్లు ఉదయమే వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు.

YS Jagan gives a warning to Chandrababu

అధికార పార్టీ నేతలు, పోలీసులు కావాలనే కవ్వింపు చర్యలకు పాల్పడుతూ రెచ్చగొడుతున్నారని వైయస్సార్ కాంగ్రెస్ నాయకులు వైయస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. తెలుగుదేశం పార్టీ నాయకులకు పోలీసులు వత్తాసు పలుకుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వివరించారు.

ఎవరూ ఎలాంటి భయాందోళనలకు గురికావద్దని, ఎలాంటి సమస్య వచ్చినా పార్టీ తరపున తాను అండగా ఉంటానని కార్యకర్తలకు జగన్ భరోసా ఇచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి కొన్ని కష్టాలుంటాయని, అవసరమైతే పోరాటం చేద్దామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+