పిల్లల విద్యపై పెట్టే పెట్టుబడులే నవభారత నిర్మాణానికి పునాది- జగన్

నేడు బాలల దినోత్సవం. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని ప్రాథమిక పాఠశాలల్లో చిల్డ్రన్స్ డే ఉత్సవాలు సాగుతున్నాయి. రోజువారీ యూనిఫాం కు బదలుగా విద్యార్థులు రంగురంగుల దుస్తులు ధరించి పాఠశాలలకు హాజరవుతున్నారు. చాచా నెహ్రూ వస్త్రధారణలో సందడి చేస్తోన్నారు. పలు పాఠశాలల్లో డ్రెస్ కాంపిటీషన్ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోన్నారు. ఈ వేడుకల కోసం స్కూళ్లు అందంగా ముస్తాబయ్యాయి.

అటు నెహ్రూ జయంతిని పురస్కరించుకుని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియా గాంధీ న్యూఢిల్లీలోని శాంతి ఘాట్ వద్ద ఆయన స్మారక చిహ్నం వద్ద పుష్పాంజలి ఘటించారు. ఆధునిక, ప్రజాస్వామ్య దేశానికి పునాదులు వేసిన ఘనత నెహ్రూదేనని గుర్తు చేశారు. సమానత్వం, లౌకికవాదం, శాస్త్రీయ ఆలోచనా విధానం పట్ల నెహ్రూకు ఉన్న నిబద్ధతను ఆయన పునరుద్ఘాటించారు. పిల్లల విద్యకు ఆయన ఇచ్చిన ప్రాధాన్యత.. భవిష్యత్ తరాలపై ఆయనకు ఉన్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తుందని అన్నారు.

YS Jagan greeting during Childrens Day celebrations says Every child deserves right to dream learn

బాలల దినోత్సవం సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిన్నారులు, విద్యార్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రేపటి సమర్థవంతమైన సమాజాన్ని, దేశ భవిష్యత్తును నిర్మించడంలో నేటి తరం పిల్లల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. సమాజంలో ప్రతీ చిన్నారీ స్వేచ్ఛగా కలలు కనే హక్కును కలిగి ఉన్నారని, వారికి నాణ్యమైన విద్యతో పాటు సురక్షిత, ఆప్యాయత కూడిన వాతావరణాన్ని అందించడం మన అందరి ప్రాథమిక బాధ్యత అని గుర్తు చేశారు.

శబరిమల ఆలయానికి వెళ్లే ప్రతి భక్తుడికీ రూ. 2 లక్షల డెత్ ఇన్సూరెన్స్ కవరేజ్
శబరిమల ఆలయానికి వెళ్లే ప్రతి భక్తుడికీ రూ. 2 లక్షల డెత్ ఇన్సూరెన్స్ కవరేజ్

చిన్నారులు తమ ఆకాంక్షలను నెరవేర్చుకునేలా ప్రోత్సహించాలని, వారి వికాసానికి అవసరమైన వనరులను సమకూర్చడమే దేశాభివృద్ధికి నిజమైన పునాది అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. పిల్లల విద్య, ఆరోగ్యం, సంక్షేమంపై చేసే పెట్టుబడులే రేపటి బలమైన భారతాన్ని తీర్చిదిద్దుతాయని వెల్లడించారు. ప్రతీ చిన్నారికి తమ కలలను సాకారం చేసుకునే అవకాశాలు దక్కినప్పుడే దేశం ప్రగతి పథంలో సాగుతుందని చెప్పారు.

ప్రతీ చిన్నారికి కుటుంబం, సమాజం, ప్రభుత్వాల నుంచి సరైన అండ లభించినప్పుడు మాత్రమే వారు తమలోని ప్రతిభను పూర్తిగా వెలికితీసి నూతన ఆవిష్కరణలతో దేశ కీర్తిని పెంచుతారనే నమ్మకాన్ని వైఎస్ జగన్ ఈ సందర్భంగా వ్యక్తం చేశారు. నవభారత నిర్మాణంలో చిన్నారుల పాత్రను గుర్తించి, వారి ఆశయాలకు రెక్కలు తొడిగేందుకు సమాజంలోని ప్రతీ ఒక్కరూ ముందుకు రావలసిన అవసరం ఉందని జగన్ పిలుపునిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+