వైఎస్ జగన్ కీలక ట్వీట్

YS Jagan Raksha Bandhan 2024: నేడు రాఖీ పౌర్ణమి. ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమి రోజును రక్షా బంధన్‌గా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అన్నా చెల్లెళ్ల మధ్య ఉండే అనుబంధాలకు ప్రతీక.. ఈ పండుగ. తన తోడబుట్టిన వాడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని, క్షేమంగా ఉండాలని కోరుకుంటూ అక్కా చెల్లెళ్లు చేతికి రక్షను కడతారు.

ఈ సారి రక్షా బంధన్ పండగ శ్రావణ సోమవారం నాడు రావడం ప్రత్యేకతను సంతరించుకుంది. దేశవ్యాప్తంగా శివాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తోన్నారు. శివలింగాలకు అభిషేకిస్తోన్నారు. వారణాశి, ఉజ్జయినీ, ప్రయాగ్‌రాజ్, సోమ్‌నాథ్, అయోధ్యలోని నాగేశ్వరనాథ్.. వంటి ఆలయాలు భక్తులతో పోటెత్తాయి.

YS Jagan greets women on auspicious Raksha Bandhan day

రక్షాబంధన్ పండగను పురస్కరించుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. మహిళలందరికీ శుభాకాంక్షలను తెలియజేశారు. అన్ని రంగాల్లోనూ మహిళలు మరింత ఎదగాలని, ఉన్నత శిఖరాలను అందుకోవాలని ఆకాంక్షించారు.

సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని వైఎస్ అన్నారు. వారి ప్రయాణంలో ఎల్లప్పుడూ తాను తోడుగా ఉంటానని హామీ ఇచ్చారు. కుటుంబాలు అత్యున్నత స్థాయికి ఎదగడానికి, మంచి భవిష్యత్తును అందించడానికి అక్కచెల్లెమ్మలే కీలకపాత్ర పోషిస్తారనే విషయాన్ని తాను బలంగా నమ్ముతానని చెప్పారు.

తన హయాంలో మహిళల అభ్యున్నతి, ఆర్థిక బలోపేతానికి ప్రవేశపెట్టి, అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు గుర్తు చేశారు. అమ్మఒడి, చేయూత, విద్యార్థులకు ట్యాబ్లు, వారికి ఆంగ్లంలో పాఠ్యాంశాల బోధన.. వంటి పథకాల వల్ల మహిళలు ఎంతగానో బలపడ్డారని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+