నన్ను అనే వారికి అంత అనుభవం లేదు, నా వల్లే: జగన్‌పై చంద్రబాబు
తనను విమర్శించే వాళ్లకు రాజకీయ అనుభవం లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం అన్నారు.
Recommended Video

విజయవాడ: తనను విమర్శించే వాళ్లకు రాజకీయ అనుభవం లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం అన్నారు. రాయలసీమకు ముచ్చుమర్రి ముఖ ద్వారమని చెప్పారు. ముచ్చుమర్రికి మరో రెండు, మూడు పంపులు ఏర్పాటు చేస్తామన్నారు.
బుక్కపట్నం చెరువును సీఎం పరిశీలించారు. అనంతరం జన్మభూమి - మా ఊరు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. రాయలసీమను రతనాల సీమగా మార్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.
తన అనుభవం వల్లే పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, నాబార్డు రుణం వచ్చిందన్నారు. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు గోదావరి నీళ్లు ఇచ్చామని, శ్రీశైలం ద్వారా అనంతపురంకు కృష్ణా నీళ్లు తీసుకు వచ్చామన్నారు.

పోలవరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత తుంగభద్ర నీళ్లు రాకపోయినా, కృష్ణా జలాలు రాయలసీమకు తరలిస్తామన్నారు. శ్రీశైలంలో డెడ్ స్టోరేజీ నుంచి కూడా నీళ్లు తీసుకునే అవకాశముందన్నారు.
ముచ్చుమర్రి ద్వారా హంద్రీనీవాకు తరలించి, అనంతపురం జిల్లాకు తాగునీటి ఎద్దడి లేకుండా శాశ్వత చర్యలు చేపడతామన్నారు. హంద్రీనీవా ద్వారా జిల్ాలలో 1260 చెరువులు నింపుతామన్నారు. అనంతపురం జిల్లా చరిత్ర తిరగరాస్తామన్నారు.
పుట్టపర్తి మునిగిపోనంతగా బుక్కపట్నం చెరువు ఎత్తు పెంచుతామని, బుక్కపట్నం చెరువు మరమ్మతుకు రూ.10 కోట్లు విడుదల చేస్తామన్నారు. కొత్త చెరువు - బుక్కపట్నం - పుట్టపర్తి ఔటర్ రింగు రోడ్డు నిర్మిస్తామన్నరు.
రాష్ట్రంలో అందరికీ నీటి భద్రత తమ లక్ష్యమని చెప్పారు. రాబోయే నాలుగు నెలల్లో మడకశిరకు నీళ్లు తీసుకు వస్తామన్నారు. రాయలసీమను రతనాల సీమగా మారుస్తామన్నారు. పోలవరం పూర్తయ్యేలోపు పట్టిసీమను తీసుకు వచ్చామన్నారు.
మనం ఆనందంగా ఉంటే సగం అనారోగ్య సమస్యలు పోతాయన్నారు. అందుకే కుటుంబ వికాసం కోసం 15 సూత్రాలు ప్రకటించామన్నారు. ఆర్థికాభివృద్ధిలో అగ్రస్థానంలో ఉండాలని వివిధ రంగాలపై శ్రద్ధ పెట్టామన్నారు.
దేశంలో తక్కువ వర్షపాతం నమోదయ్యే రెండో జిల్లా అనంతపురం అన్నారు. నీటి సమస్యను పరిష్కరించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు. అనంతపురం జిల్లాలో తాగునీటి సమస్య లేకుండా చేసే బాధ్యత తాను తీసుకుంటానని, తనకు అనుభవం ఉందని, తనను విమర్శించే వారికి అనుభవం లేదన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలు పరోక్షంగా జగన్‌ను ఉద్దేశించినవే.












Click it and Unblock the Notifications