జగన్ చేతికి టీడీపీ అస్త్రాలు- పీఏసీలో..
YS Jagan: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశమైంది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ భేటీ ఏర్పాటైంది. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి దీనికి అధ్యక్షత వహించారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తోన్నారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై దిశానిర్దేశం చేస్తోన్నారు.
పీఏసీ ఏర్పాటైన తరువాత ఈ భేటీ ఏర్పాటు కావడం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పార్టీలో అత్యంత ప్రాధాన్యత ఉండే పొలిటికల్ అడ్వైజరీ కమిటీని వైఎస్ జగన్ ఇటీవలే ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.మొత్తం 33 మందికి ఇందులో సభ్యత్వాన్ని కల్పించారు. పీఏసీ శాశ్వత ఆహ్వానితులుగా పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లు, కో-ఆర్డినేటర్‌గా సజ్జల రామకృష్ణారెడ్డి నియమితులయ్యారు.

తమ్మినేని సీతారాం, పీడిక రాజన్న దొర, బెల్లాన చంద్రశేఖర్, గొల్ల బాబురావు, బూడి ముత్యాలనాయుడు, పిల్లి సుభాష్ చంద్రబోస్, పినిపే విశ్వరూప్, తోట త్రిమూర్తులు, ముద్రగడ పద్మనాభం, పుప్పాల శ్రీనివాసరావు (వాసు బాబు), చెరుకువాడ శ్రీరంగనాథ రాజు, కొడాలి నాని, వెలంపల్లి శ్రీనివాస్.. ఇందులో అపాయింట్ అయ్యారు.
అలాగే- జోగి రమేష్, కోన రఘుపతి, విడదల రజిని, బొల్లా బ్రహ్మనాయుడు, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, నందిగం సురేష్ బాబు, ఆదిమూలపు సురేష్, పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, కళత్తూరు నారాయణస్వామి, ఆర్కే రోజా, వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నారు.
వీరితో పాటు అంజాద్ బాషా, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అబ్దుల్ హఫీజ్ ఖాన్, మాలగుండ్ల శంకర నారాయణ, తలారి రంగయ్య, విశ్వేశ్వర రెడ్డి, మహాలక్ష్మి శ్రీనివాస్, సాకే శైలజానాథ్.. పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులుగా నియమితులయ్యారు. వారందరూ కూడా ఈ భేటీకి హాజరయ్యారు.
ఈ సందర్భంగా జగన్ వారికి దిశానిర్దేశం చేస్తోన్నారు. వైఎస్సార్‌సీపీ సంస్ధాగత నిర్మాణంలో తీసుకోవాల్సిన చర్యలు, అనుసరించాల్సిన వ్యూహాలు.. వంటి పలు అంశాలు పీఏసీ భేటీలో చర్చకు వచ్చాయి. పార్టీని బ్లాక్ స్థాయి నుంచి బలోపేతం చేసుకోవడం గురించి మాట్లాడారు. ప్రభుత్వ వైఫల్యాలు తమకు అందివచ్చిన అస్త్రాలుగా మారాయని వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని ఈ సందర్భంగా వైఎస్ జగన్ అన్నారు. ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను ఎగ్గొట్టిన తీరును, అసమర్థతను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు.












Click it and Unblock the Notifications