ఎన్నికల వేళ చంద్రబాబు పై జగన్ కొత్త రికార్డ్..!!
ఏపీలో ఎన్నికలకు కౌంట్ డౌన్ కొనసాగుతోంది. పార్టీల ముఖ్య నేతలు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. చివరి మూడు రోజుల ప్రచారం హోరా హోరీగా సాగుతోంది. ఇదే సమయంలో అటు జగన్..ఇటు చంద్రబాబు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. మీడియాకు దూరంగా ఉండే సీఎం జగన్ తాజాగా ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ ఎన్నికల వేళ ఆసక్తిగా మారుతోంది. చంద్రబాబు పైన జగన్ కొత్త రికార్డు క్రియేట్ చేసారు.
ఇంటర్వ్యూ పై ఆసక్తి
ముఖ్యమంత్రి జగన్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూ ఆసక్తి కరంగా కొనసాగింది. పలు అంశాలకు జగన్ స్పష్టత ఇచ్చారు. తిరిగి అధికారంలోకి రావటం పైన క్లారిటీ ఇచ్చారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, రాష్ట్రాభివృద్ధి, ప్రజలకు అందించిన సంక్షేమం వంటి అనేక విషయాల గురించి సీఎం జగన్ క్లియర్ కట్ గా చెప్పారు. జూన్ 4 తరువాత సీఎం గా విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తానని ఆయన తెలిపారు. ప్రతీ నియోజకవర్గంలో తన పథకాల లబ్ది దారులు 50 శాతానికి పైగా ఉన్నారని వెల్లడించారు.

తన 59 నెలల పాలనలో రాష్ట్రాభివృద్ధి కోసం తీసుకున్న చర్యలను వివరించారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు, పోర్టులు, విమానాశ్రయాలు , ప్రతీ గ్రామంలో జరిగిన అభివృద్ధి గురించి చెప్పుకొచ్చారు. తన పథకాల ద్వారా భవిష్యత్ కోసం పునాదులు వేస్తున్నామని..ఆ వర్గాలకు అండగా నిలుస్తూ రాష్ట్రాభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నామన్నారు.
జగన్ వర్సస్ చంద్రబాబు
ఈ ఇంటర్వ్యూ సమయంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు మరో టీవీ ఛానల్ లో ఇంటర్వ్యూ ఇచ్చారు. అయితే, జగన్ ఇంటర్వ్యూకు లక్షల్లో వ్యూస్ వచ్చినట్లు తెలుస్తోంది. యు ట్యూబ్ లో యువత లక్షల్లో ఆ ఇంటర్వ్యూ చూసింది. పవన్ కల్యాణ్ గురించి జగన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
చంద్రబాబు కంటే జగన్ ఇంటర్వ్యూకు వచ్చిన స్పందన వైఎస్సార్ కాంగ్రెస్ క్యాడర్లో ఉత్సాహాన్ని నింపింది... ఆ ఇంటర్యూ ను ఫోన్లలో బాగా ప్రచారానికి వినియోగిస్తున్నారు..లక్షల్లో షేర్లు... లైక్స్... కామెంట్స్ తో సోషల్ మీడియా దుమ్ము రేగిపోయింది. జగన్ ఇంటర్వ్యూను లక్షల్లో చూడగా చంద్రబాబు మాటలు వేలల్లోనే ఉన్నాయ్. ఒక పక్క మోడి రోడ్ షో జరుగుతున్నా. లైవ్ స్ట్రీమింగ్ లో జగన్ ఇంటర్వ్యూకు వ్యూస్ విపరీతంగా వచ్చాయి.
జగన్ కొత్త రికార్డు
దీని పైన వైసీసీ మద్దతు దారుల్లో సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. జగన్ ఇంటర్వ్యూలో వివేకా కేసు, షర్మిల వివాదం, ల్యాండ్ టైటిల్ యాక్ట్ పైన క్లారిటీ, ఎన్నికల్లో గెలుపు పైన ధీమా వంటి అంశాలకు స్పష్టత ఇవ్వటంతో వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున సర్క్యులేట్ చేస్తున్నాయి. దీంతో..జగన్ ను సీఎం పీఠం ఎక్కించబోతుందనే సంకేతాలు ముందుగానే కనిస్తున్నాయనే అభిప్రాయం వైసీపీలో కనిపిస్తోంది.
మరో నాలుగు రోజుల్లో పోలింగ్ జరగనున్న వేళ ఈ ఇంటర్వ్యూ ద్వారా సీఎం జగన్ చంద్రబాబుపై రికార్టు సాధించారు. కూటమి చేస్తున్న ప్రచారానికి ఈ ఇంటర్వ్యూ ద్వారా పూర్తి కౌంటర్ ఇచ్చారు. దీంతో, ఎన్నికల సమయంలో ఈ ఇంటర్వ్యూ సంచలనంగా మారింది.












Click it and Unblock the Notifications