వేదాంతం చెప్పిన అపరిచితుడు, అమ్మో.. జగన్: దాడి
విశాఖ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉందని, ఆయన మంచి నటుడు అని, అపరిచితుడని దాడి వీరభద్ర రావు బుధవారం ఏకిపారేశారు. ఆయన విశాఖలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తనను చూసి ఓటేయాలనే అతి విశ్వాసం జగన్‌ది అన్నారు.
తాను ఊహించిన జగన్ వేరు.. జైలులో చూసిన జగన్ వేరని గతంలో చెప్పానని, ఇప్పుడు అదే చెబుతున్నానని... జైలులో చూసిన జగన్ వేరు, ఇప్పుడు చూస్తున్న జగన్ వేరన్నారు. పార్టీని నడిపే శక్తి లేదని జగనే నిరూపించుకున్నారన్నారు. పలువురు పార్టీ కార్యకర్తలు ఫోన్ చేసి పార్టీ నడుస్తుందా అని అడుగుతున్నారని, వారితో మాట్లాడకుంటే ఎలా అని అభిప్రాయపడ్డారు.

పార్టీలో ఉంటే ఉండండి.. లేకపోతే వెళ్లిపోండి అన్న రీతిలో వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆయన మనసులో ఒకటి.. బయట ఒకటి అన్నారు. ఆయన మెంటాలిటీని ప్రజలు భరించలేరని, అది తెలుసుకునే సరికి తమకు ఆలస్యమైందన్నారు. అయితే రాష్ట్ర ప్రజలు మాత్రం ఆయన తీరును గమనించి తిరస్కరించారన్నారు.
పార్టీలో ఆయనే వన్ మాన్ ఆర్మీ అన్నారు. ఆయనను చూసే ప్రజలు ఓటేయాలనే అతివిశ్వాసమన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఓటమికి కార్యకర్తలు, అభ్యర్థులు, నాయకులు కారణం కాదన్నారు. జగనే కారణమన్నారు. జగన్ విశ్వరూపం చూసి ప్రజలు అమ్మో జగన్ అనుకున్నారన్నారు. జైలులో ఆయనను కలిసినప్పుడు వేదాంతం వల్లించారని, అప్పుడు తాను నిజమే... యువరత్నం వస్తుందని భావించానని, అయితే అప్పటి జగన్ వేరన్నారు.
-
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్?












Click it and Unblock the Notifications