జగన్ విభజనవాది, కిరణ్ నాటకాలు: గాలి ఫైర్

కాంగ్రెస్ పార్టీతో దత్తపుత్రుడు, పెంపుడు కొడుకు లాలూచీ పడ్డారని గాలి మండిపడ్డారు. రహస్య భేటీలో వీరిద్దరూ ఢిల్లీలో కలుసుకుంటున్నారని తెలిపారు. కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల నాయకులు, కెసిఆర్ రహస్య భేటీలతో ఏదోవిధంగా రాష్ట్రాన్ని విడగొట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.
తెలంగాణ బిల్లును అసెంబ్లీలో ఓడించి పంపించిన రోజే ముఖ్యమంత్రి కిరణ్ కమార్ రెడ్డి రాజీనామా చేసివుంటే బాగుండేదని, అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు రాజీనామా డ్రామాలు ఆడుతున్నారని గాలి ముద్దుకృష్ణమ విమర్శించారు. రాజీనామా చేసి తెలంగాణవారికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు చూస్తున్నారని ఆయన అన్నారు. ఇప్పటికైనా నాటకాలు ఆపి రాష్ట్ర సమైక్యతకు కృషి చేయాలని ఆయన ముఖ్యమంత్రిని కోరారు.
బిజెపి కట్టుబడి ఉండాలి
తెలంగాణ విషయంలో ఇచ్చిన మాటకు బిజెపి కట్టుబడి ఉండాలని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన ఢిల్ీలలో మీడియాతో మాట్లాడారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదం విషయంలో బిజెపి నుంచి ఆటంకం వస్తుందన్న వార్తలో నిజం లేదన్నారు. ఒకవేళ బిజెపి మాట తప్పితే తెలంగాణ ప్రజాక్షేత్రంలో తీవ్ర నిరసన ఎదుర్కోవాల్సి వస్తుందని కోదండరాం హెచ్చరించారు.












Click it and Unblock the Notifications