నిన్న పవన్ కళ్యాణ్‌పై ఇలాగే: జగన్‌పై బీజేపీ నేత ఆసక్తికర వ్యాఖ్య
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన మంత్రి కామినేని శ్రీనివాస రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన మంత్రి కామినేని శ్రీనివాస రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ పార్ట్ టైం పొలిటీషియన్ అని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ ఆరోగ్య పథకం పైన జగన్ విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు.
ఇదిలా ఉండగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఇప్పటికే పలువురు పార్ట్ టైం పొలిటీషియన్ అని వ్యాఖ్యానిస్తున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు సమస్యల పైన స్పందిస్తోన్న విషయం తెలిసిందే. ఆయన ఇంకా పూర్తిస్థాయిలో రాజకీయాలకు కేటాయించలేదు. దీంతో ఆయనను పార్ట్ టైం పొలిటీషియన్ అంటున్నారు. ఇప్పుడు జగన్ పైన కూడా అదే కామెంట్ చేయడం విడ్డూరం.

గిరిజన ప్రాంతాలపై నిర్లక్ష్యం: జగన్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తూర్పు గోదావరి జిల్లాలో రెండో రోజు (గురువారం) పర్యటిస్తున్నారు. ఆయన మారేడుమిల్లి నుంచి వీఆర్ పురం బయలుదేరారు. వీఆర్ పురం మండలం అన్నవరంలో కాళ్ల వాపు వ్యాధి మృతుల కుటుంబాలను పరామర్శిస్తారు.
అంతకుముందు, జగన్ ప్రభుత్వం పైన మండిపడ్డారు. గిరిజన ప్రాంతాల్లో వైద్యసేవలు అందించడంతో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. మారేడుమిల్లిలో గురువారం ఉదయం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా వైద్యులు, రోగులతో మాట్లాడారు. గిరిజన ప్రాంతాల్లో అంబులెన్స్‌లు పని చేయడం లేదని జగన్ ఆరోపించారు. వేరే వాహనాల్లో దూర ప్రాంతాల ఆస్పత్రులకు తరలించేలోపే గిరిజనుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
-
పంచె కట్టులో మెరిసిన జగన్, సతీ సమేతంగా ఉగాది వేడుకలు -
'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీలో శ్రీలీల పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..? -
సొంత సినిమాను వదిలేసి పరాయి సినిమాకు భజనా? -
ఉస్తాద్‌కు బిగ్ షాక్...తొలి రోజే ఆన్లైన్లో HD ప్రింట్ ప్రత్యక్షం! -
అన్న మళ్లీ హిట్ కొట్టాడోచ్.. పవన్ కళ్యాణ్ "ఉస్తాద్ భగత్ సింగ్" మూవీ రివ్యూ..! -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది!












Click it and Unblock the Notifications