రివర్స్, పోటాపోటీ: పవన్ కళ్యాణ్‌తో కలిసేందుకు జగన్ సై, వ్యూహమా?

విజయవాడ: ఏపీకి ప్రత్యేక హోదా సాధించేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌తో కలిసేందుకు సిద్ధంగా ఉన్నారా? అంటే అవుననే అంటున్నారు ఆ పార్టీ నాయకులు.

నా పేరు తల్చుకోకుండా ఉండలేరు: కేశినేని, పవన్‌పై రెచ్చిపోతున్న ఎంపీలు

వైసిపి అధికార ప్రతినిధి అంబటి రాంబాబు సోమవారం నాడు విలేకరులతో మాట్లాడారు. హోదా కోసం తాము ఎవరితోనైనా కలుస్తామని చెప్పారు. తమకు రాష్ట్ర ప్రయోజనాలు, ఏపీకి హామీ ఇచ్చిన మేరకు ప్రత్యేక హోదా తమకు ముఖ్యమని చెప్పారు. అందుకోసం ఎవరితోనైనా కలుస్తామన్నారు.

YS Jagan is ready to fight along with Pawan Kalyan

ప్రత్యేక హోదాతో పాటు పలు అంశాల పైన పవన్ కళ్యాణ్ వేసిన ప్రశ్నలకు ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలని నిలదీశారు. హోదా, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన పోరాడితే తమ మద్దతు ఉంటుందన్నారు.

రెండు రోజుల క్రితం చిత్తూరు జిల్లా తిరుపతిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా కోసం ప్రతి ఒక్కరు కలిసి రావాలని, కాంగ్రెస్, వైసిపి, టిడిపి, జనసేనలు కలవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ నేపథ్యంలో అంబటి పైవిధంగా స్పందించారు.

కాగా, ఇన్నాళ్ల పాటు పవన్ కళ్యాణ్ పైన వైసిపి నేతలు దుమ్మెత్తిపోసిన సందర్భాలున్నాయి. ఆయన టిడిపికి, బీజేపీకి మద్దతుగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఇప్పుడు హోదా విషయంలో మాత్రం అండగా నిలబడతామని చెప్పారు.

సంతోషమని పవన్‌కు బాబు చురక: స్నేహితుడని సుజన, కేశినేని ఎదురుదాడి

ప్రత్యేక హోదా విషయంలో పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా ఉన్నారు. తనకు రాజకీయ ప్రయోజనాలు వద్దని, మీరే తీసుకోండని, హోదా మాత్రం తీసుకు వద్దామన్నారు. హోదా కోసం వైసిపి, కాంగ్రెస్ కూడా నిలదీస్తున్నాయి. టిడిపి అడుగుతున్నప్పటికీ బీజేపీ మిత్రపక్షం కాబట్టి ఇరుకున పడుతోంది.

హోదా కోసం నిజంగానే పవన్, జగన్ కలిస్తే చంద్రబాబు, బీజేపీ ఇరుకున పడ్డట్లే అంటున్నారు. లేదా టిడిపి, బీజేపీలకు మద్దతు పలుకుతున్న పవన్ కళ్యాణ్ పైన వ్యూహాత్మకంగా.. తాము మద్దతు ప్రకటిస్తామని బీజేపీ, టీడీపీ, జనసేనను కార్నర్ చేసే ప్రయత్నం చేశారా అనే చర్చ సాగుతోంది.

పవన్ కోసం పోటాపోటీ

ప్రత్యేక హోదా పైన పవన్ కళ్యాణ్ పోరాడితే తాము మద్దతిస్తామంటే తాము మద్దతిస్తామని అధికార టిడిపి, ప్రతిపక్ష వైసిపిలు చెబుతున్నాయి. పవన్ హోదా గురించి మాట్లాడటం సంతోషమని, ఆయన పోరాడితే మద్దతిస్తామని టిడిపి నేతలు, మంత్రులు గంటా శ్రీనివాస రావు, పత్తిపాటి పుల్లారావు, పలువురు ఎంపీలు చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా, మంత్రి పీతల సుజాత కూడా మద్దతిస్తామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+