రేవంత్ తో చంద్రబాబు రహస్య ఒప్పందం, ఉద్యమాలకు సిద్దం - జగన్ హెచ్చరిక..!!
మాజీ ముఖ్యమంత్రి జగన్ సంచలన ప్రకటన చేసారు. రాయలసీమ లిఫ్టు పైన వివాదం సాగు తున్న వేళ జగన్ స్పందించారు. రేవంత్ తో చంద్రబాబు చీకటి ఒప్పందం చేసుకున్నారని జగన్ ఆరోపించారు. తన కోరిక మేరకే ఏపీ సీఎం చంద్రబాబు ఈ ప్రాజెక్టును ఆపేశారని రేవంత్ చెప్పిన అంశాన్ని ప్రస్తావించారు. నీటి హక్కుల కోసం ఉద్యమాలకు సిద్దమని జగన్ స్పష్టం చేసారు. ఇక, భోగాపురం విమానాశ్రయంలో చంద్రబాబు క్రెడిట్ చోరీ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం భారీగా అప్పులు చేస్తుందని లెక్కలు చెప్పుకొచ్చారు.
రాయలసీమ లిప్టు పై ప్రస్తుతం వివాదం జరుగుతున్న వేళ మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు స్వార్ధ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టారని ఆరోపించారు. చంద్రబాబు చరిత్ర హీనులుగా మిగిలిపోతారని మండిపడ్డారు. రాయలసీమ లిఫ్టు ఆపించామని సీఎం రేవంత్ అసెంబ్లీలో చెప్పారని పేర్కొన్నారు. రాయలసీమ లిఫ్టు సీమ, నెల్లూరు జిల్లాలకు సంజీవని వంటిదని చెప్పుకొచ్చారు.

పోతిరెడ్డిపాడుకు నీళ్లు రావాలంటే శ్రీశైలంలో 881 అడుగుల నీటి మట్టం ఉండాలని చెప్పారు. పోతిరెడ్డి పాడుకు ఏడు వేల క్యూసెక్కులు రావాలంటే 854 అడుగుల ఎత్తులో ఉండాలని వివరించారు. పోతిరెడ్డి పాడు నుంచి రెండు, మూడు సార్లే నీటిని తీసుకున్నామని జగన్ చెప్పారు. 2021 లో ఎన్టీటీ ఆదేశాలు ఇచ్చినా.. అవి అమలు కాలేదని జగన్ చెప్పుకొచ్చారు.
చంద్రబాబే దగ్గర ఉండి రాయలసీమ లిఫ్టును లేకుండా చేసారని జగన్ మండిపడ్డారు. ఈ విషయంలో ఉద్యమాలకు సిద్దమని జగన్ ప్రకటించారు. ఇక.. భోగాపురం విమానాశ్రయంలో ఏం చేయకుండానే చంద్రబాబు క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. భోగాపురం విమానాశ్రయానికి అన్ని అనుమతులు తమ హయాంలోనే తెచ్చామని జగన్ వివరించారు. ఎయిర్ పోర్టుకు వ్యతిరేకంగా 130 కేసులు వేయించారని చెప్పారు.
భోగాపురం భూ సేకరణ కోసం రూ 960 కోట్లు ఖర్చు చేసామని వివరించారు. నిర్వాసితులకు భూములు కేటాయించామని చెప్పారు. కోవిడ్ సమయంలోనూ ఏయిర్ పోర్టు పనులు ఆగలేదన్నారు. 2026 లో తొలి విమానం లాండ్ అవు తుందని తాను నాడు శంకుస్థాపన రోజునే చెప్పానని గుర్తు చేసారు. కూటమి ప్రభుత్వం 18 నెలల కాలంలో చేసిన అప్పుల లెక్కలను జగన్ వెల్లడించారు. రూ 3 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసారని మండిపడ్డారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications