రాజధాని, పోలవరం పై మేనిఫెస్టోలో జగన్ కీలక ప్రకటన..!!

ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల మేనిఫెస్టోలో కీలక హామీలు ఇచ్చారు. మహిళాఓటింగ్ పైనే గురి పెట్టారు. పలు పథకాలను విస్తరించారు. ఇప్పటి వరకు ఇస్తున్న మొత్తాన్ని పెంచారు. చేయగలిగిందే చెబుతానని.. చెప్పింది చేస్తానని జగన్ స్పష్టం చేసారు. అమ్మఒడిని రూ 15 వేల నుంచి రూ 17 వేలకు పెంచారు. రైతు భరోసా ను రూ 17 వేలకు పెంచుతూ ఏడాదికి రూ 80 వేలు అందేలా హామీ ఇచ్చారు. ఇక..రాజధాని, పోలవరం పైన జగన్ మేనిఫెస్టోలో స్పష్టత ఇచ్చారుజ

రాజధాని పై క్లారిటీ
విశాఖపట్నం పరిపాలన రాజధానిగా కొనసాగుతుందని ముఖ్యమంత్రి జగన్ మేనిఫెస్టోలో ప్రకటించారు. ముందు నుంచి చెబుతున్నట్లుగా అమరావతి శాసన రాజధాని గా కొనసాగుతుందని చెప్పారు. కర్నూలు నున్యాయ రాజధానిగా చేస్తామని చెప్పారు. ప్రతీ నగరంలోనూ అభివృద్ధి జరుగుతుందని హామీ ఇచ్చారు.

YS Jagan Key assurance over Capital and polavaram in his election Manifesto

విద్యా, వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇచ్చారు. రైతు భరోసా కౌలు రైతులకు, దేవాదాయ భూములు సాగు చేస్తున్న వారికి అందిస్తామని చెప్పారు. ప్రస్తుతం అందిస్తున్న పెన్షన్ రూ 3 వేల నుంచి రూ 3,500 కి పెంచుతామని హామీ ఇచ్చారు. రానున్న అయిదేళ్ల కాలంలో వైద్యం పైన ప్రత్యేకంగా ఫోకస్ చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

పథకాల కనసాగింపు
2025 నుంచి ఒకటో తరగతి నుంచే ఐబీ సిలబస్ అమలు చేయనున్నట్లు జగన్ వెల్లడించారు. కౌలు రైతులకు కూడా రైతు భరోసా కొనసాగిస్తామని చెప్పుకొచ్చారు. లా నేస్తం కొనసాగిస్తామని చెప్పారు. చేనేత కార్మికులకు లక్షా 20 వేలు ఇచ్చారు. ప్రతీ నియోజకవర్గంలో స్కిల్ సెంటర్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

ప్రతీ నియోజకవర్గంలో, జిల్లా కేంద్రంతో పాటుగా స్కిళ్ యూనివర్సిటీ తిరుపతిలో ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. లారీ డ్రైవర్లు, టిప్పర్‌ డ్రైవర్లకు కూడా వాహన మిత్ర వర్తింపు.. రూ. 10 లోల వరకు ప్రమాద బీమా ఇస్తామని వెల్లడించారు. 50 శాతం దళితులు ఉండి..దళిత జనాభా 500 ఉన్న ఆవాసాలను పంచాయితీలుగా చేస్తామని చెప్పారు. ప్రార్ధనాలయాల నిర్వహణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు.

ఉద్యోగుల కోసం
రూ 25 వేల లోపు జీతాలు పొందుతున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు నవరత్నాలకు అర్హులుగా ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగుల పిల్లల విదేశీ విద్య రుణాలపై వడ్డీ మినహాయిస్తూ హామీ ఇచ్చారు. మౌళిక వసతులకు ప్రాధాన్యత ఇస్తామని జగన్ చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తామని జగన్ స్పష్టం చేసారు. పోలవరం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

మొదలు పెట్టిన ఇళ్ల నిర్మాణం అర్హులైన అందరికీ అందిస్తామని జగన్ వెల్లడించారు. ఇప్పటికే ఉన్న ఐబీ సిలబస్ ను ప్రస్తుతం ఒకటో తరగతికి ఉండగా.. ప్రతీ ఏడాది ఒక్కో క్లాస్ కు పెంచుకుంటూ వెళ్తామని జగన్ ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ కాలనీలకు ఉచిత కరెంట్. లారీ డ్రైవర్లకు రూ 10 లక్షల ఉచిత భీమా సౌకర్యం కల్పిస్తామని జగన్ ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+