వారికే ఇక ప్రాధాన్యత - పార్టీ నేతలకు తేల్చేసిన జగన్..!!

మాజీ ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ బలోపేతం దిశగా తన లక్ష్యాలను స్పష్టం చేసారు. పార్టీలో కింది స్థాయి కేడర్ కే ప్రాధాన్యత ఉంటుందని తేల్చి చెప్పారు. పార్టీని దేశంలోనే అత్యంత బలమైన పార్టీగా తీర్చి దిద్దే కార్యక్రమం ప్రారంభించామని వెల్లడించారు. రానున్న రోజుల్లో మరిన్ని కీలక నిర్ణయాలు ఉంటాయని స్పష్టం చేసారు. తిరుమల లడ్డూ వివాదం పైన ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు.

డైవర్షన్ పాలిటిక్స్
వైసీపీ అధినేత జగన్ పార్టీ అనుబంధ సంఘాల నేతలతో సమావేశమయ్యారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ఇప్పటి వరకు విఫలమైందని ఆరోపించారు. ఏ ఒక్క హమీ దిశగా ఆలోచన చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని వ్యాఖ్యానించారు. దేవుడికి ఆగ్రహం తెప్పించే విధంగా వారి పాలన సాగుతోందని మండిపడ్డారు. నాలుగు నెలల్లోనే చంద్రబాబు ప్రభుత్వం పైన ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని జగన్ చెప్పుకొచ్చారు.

YS Jagan key decision for strengthening the party appeal for leaders

ప్రజల్లో వ్యతిరేకత
రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయటం లేదన్నారు. అన్ని అంశాల్లోనూ పాలన కుప్పకూలిందని జగన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన సాగుతోందని..తప్పుడు కేసులు పెడుతోందని ఆరోపించారు. లా అండ్ ఆర్డర్ ఎక్కడా కనిపించటం లేదన్నారు. పారదర్శకత లేదన్నారు. విజయవాడ వరద బాధితులకు సాయం అందటం లేదని విమర్శించారు. ప్రజలను డైవర్ట్ చేయటానికి కొత్త టాపిక్స్ తెర మీదకు తెస్తున్నారని చెప్పారు. పార్టీలో కష్టపడి పని చేసే వారికి ప్రాధాన్యత ఉంటుందని జగన్ వెల్లడించారు. తాను కేవలం పార్టీలో అందరి ప్రతినిధిని మాత్రమేనని స్పష్టం చేసారు.

వారికే గుర్తింపు
పార్టీ కోసం కష్టపడే వారికి, ఆ ప్రక్రియలో నష్టపోయిన వారికి పూర్తిగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వారికే పార్టీలో అన్ని రకాలుగా ప్రధమ ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. క్షేత్ర స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నారు. దేశంలో బలమైన పార్టీగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని మొదలుపెట్టామన్నారు. పార్టీ కోసం ఎంతో మంది మద్దతుగా నిలిచారన్నారు. వీరిని పార్టీ వ్యవస్థల్లోకి తీసుకురావాలన్నారు. ప్రజల తరపున పోరాటాల్లో చురుకుగా ఉండాలని జగన్ సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+