కేసుల వేళ జగన్ ఊహించని నిర్ణయం, ఇక..!!
ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం కొత్త నిర్ణయాలను అమలు చేస్తోంది. రాజకీయంగానూ రూటు మార్చింది. జగన్ ను రాజకీయంగ ఉక్కిరి బిక్కిరి చేసేలా కొత్త కార్యాచరణ తో ముందుకు వెళ్తోంది. అటు మాజీ సీఎం జగన్ సైతం కూటమిని టార్గెట్ చేస్తున్నారు. తాజాగా సింగయ్య మరణం విషయంలో కొత్త అంశాలు తెర మీదకు వస్తున్నాయి. జగన్ తో పాటుగా పార్టీ ముఖ్య నేతల పైనా కేసు నమోదైంది. ఈ సమయంలోనే జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
జగన్ పై కేసుతో
ఏపీలో కొత్త రాజకీయం కనిపిస్తోంది. జగన్ పల్నాడు పర్యటన నుంచి కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జగన్ పర్యటన సమయంలో కార్యకర్తలు ప్రదర్శించిన వివాదాస్పద ఫ్లెక్సీలు, జగన్ కామెంట్స్ పైన సీఎం చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు ఫైర్ అయ్యారు. ప్లకార్డులు ప్రదర్శించిన వారిని అరెస్ట్ చేసారు. ఇక.. అదే పర్యటన సమయంలో మరణించిన సింగయ్య జగన్ కారు కింద పడి ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో జగన్ ను చేర్చటం తో ఈ వ్యవహారం కొత్త మలుపు తీసుకుంది. జగన్ ను ఏ-2గా నమోదు చేయగా, పార్టీ నేతలు వైవీ పేర్ని, రజనీ పైన కేసు నమోదు చేసారు. దీంతో, తాజా పరిణామాల పైన జగన్ పార్టీ ముఖ్య నేతలతో చర్చించారు. కీలక భేటీకి నిర్ణయించారు.

పార్టీ నేతలకు పిలుపు
ఈ కేసులు.. టీడీపీ చేస్తున్న ప్రచారం తో జగన్ అలర్ట్ అయ్యారు. ఈ నెల 25న పార్టీ ముఖ్య నేతల సమావేశం ఏర్పాటు చేసారు. పీఏసీ సభ్యులు.. రీజనల్ కో ఆర్డినేటర్లు.. పార్టీ ముఖ్యులను తాడేపల్లి కి రావాల్సిందిగా సమాచారం ఇచ్చారు. జగన్ లక్ష్యంగా జరుగుతున్న రాజకీయం వేళ కొత్త వ్యూహం తో జగన్ ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు. దీని పైన పార్టీ ముఖ్య నేతల సమావేశంలో జగన్ దిశా నిర్దేశం చేయనున్నారు. ఉద్దేశ పూర్వకంగా తన పైన ప్రచారం చేస్తున్నారనే అభి ప్రాయం తో జగన్ ఉన్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. జగన్ పర్యటనలకు బ్రేక్ వేసేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారనేది వైసీపీ నేతల వాదన. కాగా.. ఇక, జగన్ జూలై 8వ తేదీన వైఎస్సార్ జన్మదినం నాడు జగన్ ఇడుపుల పాయ వెళ్లనున్నారు. ఆ రోజు నుంచే జిల్లాల పర్యటన లు ప్రారంభించాలని జగన్ భావిస్తున్నట్లు పార్టీ నేతల సమాచారం.
జగన్ కీలక నిర్ణయం
ఏడాది కాలం పూర్తి కావటంతో ప్రభుత్వ వైఫల్యాల ను ఇక ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సమాయత్తం కావాలని జగన్ డిసైడ్ అయ్యారు. ఇందు కోసం సమస్యల పైన ప్రాంతాల వారీగా నిరసన కార్యక్ర మాల నిర్వహణ పైన ఈ సమావేశంలో చర్చించనున్నారు. జిల్లా స్థాయిలోనూ సమస్యల పైన పోరు బాట నిర్వహించేలా పూర్తి సమాచారంతో రావాలని ప్రాంతీయ సమన్వయకర్తలకు పార్టీ కార్యాల నుంచి సమాచారం ఇచ్చారు. రాష్ట్ర స్థాయిలో నిర్వహించే నిరసనల్లో జగన్ సైతం మూడు ప్రాంతా నూ మూడు కార్యక్రమాలకు రూప కల్పన చేస్తున్నారు. వరుస కేసులు.. రాజకీయ విమర్శల వేళ ఇక ప్రజల్లోనూ ఉంటూ తిప్పి కొట్టే వ్యూహంతో జగన్ ఉన్నట్లు పార్టీ సీనియర్లు చెబుతున్నారు. దీంతో ,ఇటు జగన్ పైన కేసు.. అటు పార్టీ నేతలతో జగన్ కీలక సమావేశం వేళ ఎటువంటి నిర్ణయాలు జరుగుతాయనేది ఉత్కంఠగా మారుతోంది.
-
జగన్ బిగ్ ప్లాన్, 2019 కాంబో రిపీట్ - మారుతున్న లెక్కలు..!! -
పంచె కట్టులో మెరిసిన జగన్, సతీ సమేతంగా ఉగాది వేడుకలు -
రోజా పవర్ ప్యాక్డ్ పంచ్ లు -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications