ప్రేమతో రూ 200 కోట్లు ఇచ్చాను, నీకు కృతజ్ఞత లేదు - షర్మిలకు జగన్ లేఖ..!!
వైఎస్ కుటుంబంలో ఆస్తుల వివాదం రచ్చకెక్కింది. మాజీ సీఎం జగన్ .. వైఎస్ షర్మిల మధ్య పంచాయితీ కోర్టులకు చేరింది. ఇద్దరి మధ్య లేఖల యుద్దం సాగుతోంది. తాజాగా జగన్ - షర్మిల మధ్య సరస్వతి పవర్ షేర్ల వివాదంలో జగన్ కేసు దాఖలు చేసారు. ఈ వివాదంపై జగన్ కు షర్మిల రాసిన లేఖను టీడీపీ బయట పెట్టింది. ఇక..ఇదే సమయంలో తమ ఇద్దరి మధ్య ఆస్తి - రాజకీయ విభేదాల పైన షర్మిలకు జగన్ లేఖ రాసారు. అందులో పలు కీలక అంశాలను ప్రస్తావించారు.
ప్రతిష్ఠ దెబ్బ తీసావు
మాజీ సీఎం జగన్ తన సోదరి షర్మిలకు రాసిన లేఖలో తనను విభేదించిన అంశంతో పాటుగా తాను ఆర్దికంగా చేసిన లావా దేవీల గురించి వివరించారు. తనను రాజకీయంగా వ్యతిరేకించటం తో పాటుగా వ్యక్తిగత ప్రతిష్ఠ దెబ్బ తీసేలా వ్యవహరించావని పేర్కొన్నారు. బహిరంగంగా తప్పుడు ప్రకటనలు చేసావంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. అసత్యాలు చెప్పావని పేర్కొన్నారు. షర్మిల చేసిన చర్యలు తనను బాధించాయని జగన్ తన లేఖలో వివరించారు. ఈ కారణంగానే సరస్వతి పవర్ కంపెనీలో గిఫ్ట్ డీడ్ కింద రాసిచ్చిన వాటాలను వెనక్కు తీసుకుంటున్నట్లు జగన్ తన లేఖలో స్పష్టం చేసారు.

ప్రేమతో కోట్లు ఇచ్చాను
నాన్న సంపాదించిన, వారసత్వంగా సంక్రమించిన ఆస్తుల్ని ఆయన బతికి ఉన్న సమయంలోనే ఇద్దరికీ సమానంగా పంచారని జగన్ తన లేఖలో గుర్తు చేసారు. ఆ తరువాత తన సొంత శ్రమ, పెట్టుబడితో వ్యాపారాలు మొదలు పెట్టానని చెప్పుకొచ్చారు. వాటికి వారసత్వంతో ఎలాంటి సంబంధం లేదన్నారు. ఎంతో ప్రేమ, ఆప్యాయతతో కొన్ని ఆస్తుల్ని షర్మిల పేరిట బదిలీ చేసానని జగన్ వివరించారు. అమ్మ పేరిట కూడా కొన్ని షేర్లు రాసిచ్చానని వివరించారు. న్యాయ పరమైన చిక్కులు తొలిగాక భవిష్యత్తులో ఆ ఆస్తులు షర్మిలకు చెందేలా ఒప్పందం చేసినట్లు గుర్తు చేసారు. అవి కాకుండా తన చెల్లికి నేరుగా, అమ్మ ద్వారా గత దశాబ్ద కాలంగా రూ 200 కోట్లు ఇచ్చానని షర్మిలకు రాసిన లేఖలో జగన్ వెల్లడించారు. ఇదంతా ప్రేమతోనే చేసానని చెప్పారు.
"నన్ను రాజకీయంగా ఏమి అనకు, రాజకీయంగా నాకు అడ్డు రాకు, అప్పుడు నీకు ఆస్తులు రాసిస్తా..."
— Telugu Desam Party (@JaiTDP) October 23, 2024
సొంత చెల్లి షర్మిలని బెదిరిస్తూ లేఖ రాసిన సైకో జగన్
"నన్ను రాజకీయంగా ఇబ్బందులు పెడుతుంటే, నీకు నేను ఆస్తులు ఎందుకు ఇవ్వాలి ? రాజకీయంగా నా పై విమర్శలు చేస్తున్న నీకు, నేను చిల్లి గవ్వ… pic.twitter.com/9w0tpvLsPQ
వ్యతిరేకంగా వ్యవహరించావు
అయినా, షర్మిల కనీస కృతజ్ఞత లేకుండా తనతో వ్యవహరించిందని జగన్ ఆ లేఖలో వ్యాఖ్యానించారు. తనకు వ్యతిరేకంగా అనేక చర్యలకు పాల్పడ్డ షర్మిల పై ప్రేమ, ఆప్యాయత చూపాల్సిన అవసరం లేదని జగన్ పేర్కొన్నారు. షర్మిల ఆలోచనలో, ప్రవర్తనలో ఏమైనా సానుకూల మార్పు వస్తే కోర్టు సమస్యలు పరిష్కారం అయ్యాక ఆస్తులకు సంబంధించి ఏం చేయాలి..ఏం చేయకూడదు..ఎంత చేయాలనే అంశాలను తిరిగి పరిశీలిస్తానని జగన్ లేఖలో స్పష్టం చేసారు. అవినాశ్, భారతికి వ్యతిరేకంగా మాట్లాడవద్దని జగన్ లేఖలో కోరారు. రాజకీయంగా వ్యతిరేకంగా ఉండొద్దని జగన్ తన లేఖలో షర్మిలకు రాసిన లేఖలో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications