స్పీకర్‌పై జగన్ వ్యాఖ్యలు: కెఈ ఘాటు విమర్సలు
హైదరాబాద్: ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద రావుపై వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్‌పై చర్చలో భాగంగా జగన్ మాట్లాడుతూ మీ సహకారంతో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు చాలా కష్టపడుతున్నారని స్పీకర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. జగన్ వ్యాఖ్యలపై టిడిపి సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
దీనిపై స్పీకర్ మాట్లాడుతూ ప్రతిపక్ష నేతగా జగన్ హుందాతనం కాపాడుకోవాలని సూచించారు. శాసనసభలో సభ్యులు సమయపాలనకు కట్టుబడి ఉండాలని ఆయన ఓ సందర్భంలో సూచించారు. సభలో సభ్యులందరూ మాట్లాడే హక్కును వినియోగించుకునే విధంగా సహకరించాలని ఆయన అన్నారు.

ప్రతిపక్షంలో ఉన్న వారికి అధికారపక్షం ఏం చేసినా తప్పుగానే కన్పిస్తుందని, ప్రతిపక్ష నేత తన ధోరణిని మార్చుకుంటే బాగుంటుందనని ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి అన్నారు. పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లు రాష్ర్టాన్ని అభివృద్ధి చేసేందుకు ఉత్సుకత చూపుతుంటే తమపై తప్పుడు వ్యాఖ్యలు చేసి నవ్యాంధ్రప్రదేశ్‌ను అణదొక్కేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్‌ను మరింత ఉన్నతస్థాయి తీసుకెళ్లాలని సవాల్ చేస్తే స్వాగతిస్తాం తప్ప తమపై విమర్శలు చేస్తే సహించేది లేదని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications