నా వాళ్ల మీద చేయి వేస్తే నా మీద వేసినట్లే, ఇక్కడే ఉంటా... ఎవరొస్తారో రండి- జగన్..!!
మాజీ ముఖ్యమంత్రి జగన్ సంచలన వ్యాఖ్యలు చేసారు. స్థానిక ఎన్నికల వేళ జరుగుతున్న పరిణా మాల పైన సీరియస్ గా స్పందించారు. సీఎం చంద్రబాబు పై విరుచుకుపడ్డారు. కార్యకర్తలకు కీలక దిశా నిర్దేశం చేసారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం.. హక్కులను కాపాడుకోవటం కోసం తిరగ బడాలని పిలుపునిచ్చారు. తన పార్టీ కార్యకర్త పైన చేయి వేస్తే తన పైన వేసినట్లేనని జగన్ తేల్చి చెప్పారు. ఏ ఒక్కరికీ వదిలేది లేదని హెచ్చరించారు. పులివెందులలో అధికార కూటమికి దెబ్బ కొడితే రాష్ట్రం మొత్తం వినిపించాలన్నారు. పాదయాత్ర పైనా ప్రకటన చేసారు.
పార్టీ కార్యకర్తల పై దెబ్బ పడితే చూస్తూ ఊరుకోనని మాజీ సీఎం జగన్ తేల్చి చెప్పారు. స్థానిక ఎన్నికల వేళ చోటు చేసుకున్న ఘటనలు.. దాడుల పైన జగన్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తిరగబడాలని పిలుపునిచ్చారు. పులివెందులలో చోటు చేసుకున్న పరిణామాల పైన వివరించారు. ఓటింగ్ రోజున తాను పులివెందులలోనే ఉంటానని ప్రకటించారు. తాను అక్కడే ఓటు వేస్తానని.. ఎవరు దౌర్జన్యం చేయటానికి వస్తారో రావాలని.. తాను చొక్కా మడత వేసే ఉన్నానని...ఎవరు రావాలనుకుంటున్నారో రావాలని సవాల్ చేసారు. పులివెందులో కొట్టే దెబ్బకు రాష్ట్రం మొత్తం సౌండ్ రావాలని జగన్ పిలుపు ఇచ్చారు. తన పార్టీ కార్యకర్తల పైన చేయి వేస్తే తన పైన వేసినట్లేనని జగన్ స్పష్టం చేసారు. అధికార పార్టీ కోసం పని చేసిన ఏ ఒక్క పోలీసు అధికారిని వదిలేది లేదని జగన్ హెచ్చరించారు.

పులివెందులలో ఓటు వేస్తానన్న జగన్
అన్యాయం చేసిన ఏ అధికారిని వదిలేదని తేల్చి చెప్పార. వచ్చే ఏడాది సెప్టెంబర్ లో తన పాదయాత్ర ప్రారంభం అవుతుందని జగన్ ప్రకటించారు. తాను పులివెందుల ప్రజలతోనే ఏ కష్టం వచ్చినా.. నష్టం వచ్చినా పంచుకుంటానని.. జగన్ ఈ స్థాయికి వచ్చాడంటే కారణంగా ఇక్కడి వారేనని చెప్పుకొచ్చారు. చంద్రబాబుకు తమను ఎన్నికల్లో ఎదుర్కునే ధైర్యం ఉంటే ఇలా తమ పార్టీ వారి నామినేషన్లు అడ్డుకోరని వ్యాఖ్యానించారు. తమ పార్టీ మహిళల పైన దాడులు చేసారని.. అసభ్యంగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రతిపక్షంలో వైసీపీ కష్టాలు ఎదుర్కోవటం కొత్త కాదని.. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు సింగిల్ డిజిట్ కు పరిమితం అవుతారని జగన్ పేర్కొన్నారు. జగన్ పులివెందుల కేంద్రంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.













Click it and Unblock the Notifications
