చంద్రబాబును చెప్పుతో కొట్టాలి: వైఎస్ జగన్ తీవ్ర వ్యాఖ్య
అనంతపురం: ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, ఆయనకు నవనిర్మాణ దీక్ష చేసే హక్కు లేదని విమర్శించారు.

నవనిర్మాణ దీక్షలో చంద్రబాబు చెప్పింది నిజంగా జరగాలంటే ప్రజలు చేయాల్సింది ఒక్కటేనని, ఎక్కడ కనిపిస్తే అక్కడ అవినీతి చంద్రబాబును చెప్పులతో కొట్టడమేనని, అప్పుడు తప్ప చంద్రబాబుకు బుద్ధి రాదని అన్నారు. అనంతపురం జిల్లా పెద్దవడుగూరులో గురువారం జరిగిన రెండో రోజు రైతు భరోసా యాత్రలో ఆయన మీడియాతో మాట్లాడారు.
గుడిని గుడిలోని లింగాన్నీ మింగే చంద్రబాబుకు అవినీతి గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ఆంధ్రప్రదేస్ నూతన రాజధాని ప్రాంతంలో భూములను తక్కువ ధరకు పెట్టుబడిదారులకు కట్టబెట్టారని, అలా సంపాదించిన అవినీతి డబ్బుతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొంటున్నారని ఆరోపించారు. పార్టీలో చేరిన ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి, తిరిగి గెలిపించుకొనే దమ్ము, ధైర్యం చంద్రబాబుకు ఉందా అని ఆయన అడిగారు.

తెలంగాణాలో అక్రమంగా ప్రాజెక్టులు కడుతున్నా అడిగే దమ్ము చంద్రబాబుకు లేదని జగన్ విమర్శించారు. ఒకవేళ అడిగితే ఓటుకు నోటు కేసులో కేసీఆర్ జైలుకు పంపుతారని చంద్రబాబు భయపడుతున్నారని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుంటే కేంద్రంలో తన మంత్రులను ఉపసంహరించుకుంటానని అల్టిమేటం ఇచ్చే పరిస్థితీ కూడా లేదని అన్నారు. అలా చేస్తే ఈ రెండేళ్లలో చంద్రబాబు అవినీతిపై ప్రధాని నరేంద్ర మోడీ సీబీఐ విచారణ చేయిస్తారని భయమని విమర్శించారు.

న్నికల సమయంలో ప్రజలను అన్నిరకాలుగా వంచన చేసి సీఎం పీఠం ఎక్కిన చంద్రబాబుకు త్వరలోనే ప్రజల నుంచి తిరుగుబాటును ఎదుర్కోక తప్పదని ఆయన హెచ్చరించారు. ఎన్నికల సమయంలో రుణమాఫీ చేస్తామని డాంబికాలు పలికిన ఆయన మాటలను నమ్మిన రైతులు చివరకు రుణమాఫీ కాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications