జగన్ పార్టీ ప్రక్షాళన షురూ - కోటరీ నేతల ఔట్, వారికి ఛాన్స్..!!

ఏపీ ఎన్నికల తరువాత జగన్ ఆలోచన మారింది. ఎన్నికల్లో ఊహించని పరాజయంతో జగన్ ముఖ్య నేతలతో సమీక్ష చేసారు. లోపాలను గుర్తించారు. పార్టీ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాల పైన ఫోకస్ చేసారు. పార్టీ పదవుల్లోనూ మార్పులు మొదలు పెట్టారు. జగన్ కు కుడి భుజం గా చెప్పుకొనే పార్టీలో ముఖ్యనేత బాధ్యతల మార్పుకు నిర్ణయించారు. అదే విధంగా పార్టీ నేతలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు.

జగన్ అలర్ట్
ఎన్నికల ఫలితాల తరువాత జగన్ అలర్ట్ అయ్యారు. పార్టీ పరంగా చేపట్టాల్సిన చర్యలను తక్షణమే ప్రారంభించాలని నిర్ణయించారు. అందులో భాగంగా జగన్ కోటరీగా చెప్పుకుంటూ ఇప్పుడు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న నేతల స్థానాలు మార్పు దిశగా కసరత్తు జరుగుతోంది. పార్లమెంటరీ పార్టీ నేతగా వైవీ సుబ్బారెడ్డిని ప్రకటించిన జగన్..పార్టీ పదవుల్లోనూ మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. జగన్ సీఎంగా ఉన్న సమయంలో పార్టీ ప్రధాన కార్యదర్శిగా సజ్జల ఎమ్మెల్యేలు - పార్టీ అంతర్గత వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించారు. అయితే, ఓటమి తరువాత సజ్జల లక్ష్యంగా పలువురు నేతలు తీవ్ర ఆరోపణలు చేసారు.

YS Jagan making key decisions over Strengthen the party fixed road map for main leaders

కీలక నియామకాలు
ముఖ్యమంత్రిగా జగన్ ఉన్న సమయంలో ఉద్యోగులు దూరం అవ్వటంతో పాటుగా ఎమ్మెల్యేలు కలవటానికి వీలు లేకుండా సజ్జల వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. అదే విధంగా సీఎం నమ్ముకున్న అధికారి ధనుంజయ రెడ్డి పైన విమర్శలు వచ్చాయి. దీంతో..ఇప్పుుడు పార్టీ వ్యవహారాల్లో తిరిగి విజయసాయిరెడ్డికి కీలక బాధ్యతలు ఇవ్వాలని జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో పాటుగా పార్టీ అధికార ప్రతినిధుల విషయంలోనూ మార్పులు చేస్తున్నారు. రాష్ట్ర, జిల్లాల స్థాయిలో అధికార ప్రతినిధులను నియమిస్తున్నారు. ఇక..తాను సైతం ప్రభుత్వ నిర్ణయాల పైన మీడియా ముందుకు రావాలని నిర్ణయించారు.

YS Jagan making key decisions over Strengthen the party fixed road map for main leaders

జిల్లాల పర్యటనలు
తాజాగా.. సోషల్ మీడియా బాధ్యతల నుంచి సజ్జల భార్గవ్ దూరం అయ్యారని..ఆయన స్థానంలో నాగార్జున యాదవ్ ను నియమిస్తున్నారనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. కానీ, వైసీపీ నేతలు ఈ వార్తలను ఖండించారు. సీనియార్టీ- యువ నేతలకు ప్రాధాన్యత ఇస్తూ పార్టీలో పదవులను భర్తీ చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఈ నెల 27వ తేదీ నుంచి తొలుత పులివెందుల, ఆ తరువాత పల్నాడు జిల్లాల్లో జగన్ పర్యటించనున్నారు. ప్రభుత్వానికి కొంత సమయం ఇచ్చి...ఆ తరువాత ప్రభుత్వం తీసుకొనే నిర్ణయాలకు అనుగుణంగా ప్రజల్లోకి వెళ్లాలని జగన్ డిసైడ్ అయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+