Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బాబు హైదరాబాద్ ఓటర్, ఈనాడు రాసింది: జగన్

హైదరాబాద్: ప్రజల తరఫున స్పీకర్లుగా మీడియా రావడం ఆనందంగా ఉందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అన్నారు. మీడియానే స్పీకర్లు అయినప్పుడు ప్రజలకు మేలు జరుగుతుందని ఆయన అన్నారు. తమ పార్టీ శాసనసభకు గైర్హాజర్ అయిన నేపథ్యంలో ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. గురువారంనాడు బడ్జెట్‌పై తన ప్రసంగానికి అంతరాయాలు కలిగించారని ఆయన విమర్శించారు.

రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని సామాజిక ఆర్థిక సర్వేను చూపిస్తూ చెప్పానని, రైతుల పరిస్థితి ఇలా ఉండడానికి కారణం మీరు ఎన్నికల ముందు చెప్పిందేమిటి, గెలిచిన తర్వాత చేసిందేమిటని చంద్రబాబును అడుగుతుంటే రైతుల గురించి మాట్లాడకూడదని స్పీకర్ మైక్ కట్ చేశారని ఆయన అన్నారు. ప్రణాళికేతర వ్యవయాన్ని ఏకంగా 11 వేల కోట్లు తగ్గించారని ఆయన అన్నారు. గురువారంనాడు శాసనసభలో తాను ఎక్కడ వదిలేశానో అక్కడి నుంచి మీడియా సమావేశంలో విషయాలను ప్రారంభిస్తానని ఆయన చెప్పారు.

YS Jagan media conference assembly developments

భావి తరాలకు నేర్పాల్సింది వెన్నుపోట్లు కాదని, నేర్పాల్సింది సాధించుకోవాల్సిన దాన్ని ఎలా సాధించుకోవాలనేది నేర్పాలని జగన్ అన్నారు. రైతు రుణాలను, డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేస్తానని చంద్రబాబు చెప్పారని ఆయన అన్నారు. బడ్జెట్‌లో కేటాయింపులు తగ్గించారని ఆయన అన్నారు. జాబ్ కావాలంటే బాబు రావాలని ఎన్నికలకు మందు చెప్పారని గుర్తు చేశారు.

ఎన్నికలకు ముందు చంద్రబాబు సంతకంతో తెలుగుదేశం పార్టీ రాసి, ఇంటింటికీ పంపిన లేఖల్లో ఇచ్చిన హామీలను ఆయన గుర్తు చేశారు. గణాంకాలను పెంచి చూపించడం, మోసం చేయడం, అబద్ధాలు చెప్పడం సరి కాదని ఆయన అన్నారు. బడ్జెట్ లెక్కల వల్ల ఢిల్లీలో మన పరువు పోయిందని ఆయన అన్నారు. రైతుల రుణమాఫీ గురించి మాట్లాడుతుంటే నేరుగా స్పకరే పిక్చర్లోకి వచ్చారని, ఆ విషయం మాట్లాడకూడదని చెప్పారని, ఏం మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో స్పీకరే నిర్ణయిస్తున్నారని ఆయన అన్నారు.లెక్కలు పెంచి చూపిస్తే మన రాష్ట్రం గురించి, మన ప్రజల గురించి ఢిల్లీ వాళ్లు ఏమనుకుంటారని ఆయన అడిగారు ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలను నెరువేరుస్తామని ఎన్నికల కమిషన్‌కు చంద్రబాబు లేఖలు కూడా రాశారని ఆయన గుర్తు చేశారు. బ్యాంకుల్లో బంగారం రావాలంటే, బాబు రావాలని హామీలు ఇచ్చారని ఆయన అన్నారు. 214 మార్చి 31వ తేదీనాటికి ఉన్న డేటాను బ్యాంకర్లు చంద్రబాబుకు చూపించారని, రుణాలు చెల్లించడానికి రైతులు సుముఖంగా లేరని కూడా చెప్పారని, రుణాలు చెల్లించలేదు కాబట్టి రైతులకు బీమా ఉండదని బ్యాంకర్లు చంద్రబాబుకు చెప్పారని ఆయన అన్నారు.

2014లో రైతు రుణాలు రూ. 87,612, డ్వాక్రా రుణాలు రూ. 14204 కోట్లు ఉన్నాయని ఆయన చెప్పారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు. రైతులకు 56 వేల కోట్ల రూణాలను బ్యాంకులు ఇవ్వాల్సి ఉండగా, 13 వేల కోట్ల మేరకు మాత్రమే ఇచ్చారని, మిగతా 46 వేల కోట్ల రుణాలను రైతులు ప్రైవేట్ వ్యక్తుల నుంచి రెండు రూపాయల వడ్డీకి తెచ్చుకోవాల్సిన స్థితిలో పడ్డారని ఆయన అన్నారు.

ఇంటింటికీ పంపిన లేఖలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పూర్తి అవగాహన ఉందని చంద్రబాబు చెప్పారని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబు మాటలు నమ్మి రుణాలు చెల్లించకపోవడంతో 14 శాతం అపరాధ వడ్డీ పడుతోందని ఆయన అన్నారు. 11 వేల 200 కోట్లతో పాటు 800 కోట్ల రూపాయలు వడ్డీకే చెల్లించాల్సి వస్తోందని, దీన్నంతా ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. దీనికి ప్రభుత్వం కేవలం 172 కోట్లు మాత్రమే ప్రభుత్వం కేటాయించిందని జగన్ చెప్పారు.బంగారం వేలం వేస్తున్నట్లు రైతులకు ప్రతి రోజూ నోటీసులు వస్తున్నాయని, చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో కూడా ఇదే పరిస్థితి ఉందని ఆయన చెప్పారు. ప్రతి రోజూ ప్రతీ పత్రికలో బంగారం వేలం నోటీసులు కనిపిస్తున్నాయని ఆయన అన్నారు. ఇటువంటి దారుణమైన పరిస్థితిలో రైతులు పడ్డారని ఆయన అన్నారు. తులానికి 27 వేల రూపాయల ధర ఉందని, తులానికి బ్యాంకులు ఇచ్చిన రుణాలు పది వేల రూపాయలు అని ఆయన అన్నారు. రుణాలు మాఫీ అవుతాయని రైతులు రుణాలు చెల్లించలేదని, సగం విలువకే రుణాలు వచ్చాయని, వాటిని వదులుకోవాల్సిన స్థితిలో రైతులు పడ్డారని ఆయన అన్నారు.

చంద్రబాబు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఏమిటి, ఎన్నికలు ముగిసిన తర్వాత చెబుతున్నదేమిటి అనేది చూడాలని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కాకముందు ఓ మాట, ముఖ్యమంత్రి అయిన తర్వాత మరో మాట చంద్రబాబు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. రైతు రుణాల మాఫీకి పరిమితులు విధిస్తాననీ ఆధార్‌తో ముడి పెడుతానని, కొంత మందికి మాత్రమే వర్తింపజేస్తానని చంద్రబాబు ఎప్పుడైనా చెప్పారా అని ఆయన ప్రశ్నించారు. హార్టీకల్చర్‌ను మినహాయిస్తామని చెప్పారా, హైదరాబాదులో ఆధార్ కార్డులూ లేదా రేషన్ కార్డులూ ఉన్నవారికి రుణమాఫీ వర్తింపజేయమని ఎప్పుడైనా చంద్రబాబు చెప్పారా అని అడిగారు.

హైదరాబాదులో ఉన్న రైతులకు రుణమాఫీ ఇవ్వడానికి చంద్రబాబుకు మనసు రాదని, చంద్రబాబుకు ఇక్కడే రేషన్ కార్డు, పాన్ కార్డు, ఆధార్ కార్డు కూడా ఉండవచ్చు, ఓటర్ కార్డు కూడా హైదరాబాదులో ఉండవచ్చు, కానీ తాను ఎపికి ముఖ్యమంత్రిని కావాలని చంద్రబాబు అనుకుంటారని ఆయన అన్నారు. తాను 50 వేల రూపాయల లోపు రుణాలను అన్నింటినీ మాఫీ చేస్తానని చంద్రబాబు అంటారని, రాష్ట్రంలో 13283 కోట్ల రూపాయలు ఆ రుణాలు ఉన్నాయని, ఆ విషయం చంద్రబాబుకు తెలియదని ఆయన చెప్పారు.

రైతుల ఆత్మహత్యలకు సంబంధించిన వివరాలను జగన్ ఈ సందర్భంగా చెప్పారు. నిర్దిష్టమైన పేర్లతో రైతులకు ఎలా రుణమాఫీ ఏ మేరకు అందిందో వివరించారు. కేశప్ప, గోవింద రెడ్డి వంటివారికి వడ్డీలేని రుణాలు లేదా పావలా వడ్డీ రుణాలైన వస్తూ ఉండేవని, ఇప్పుడు 14 శాతం అపరాధం రుసుం కట్టాల్సి వస్తోందని ఆయన అన్నారు. ఈనాడులో వార్తాకథనం వచ్చిందని, అందులో నలుగురు రైతులు అనంతపురం జిల్లాలో ఆత్మహత్యలు చేసుకున్నారని, ఆ వార్తాకథనాన్ని జగన్ చదివి వినిపించారు.

రాష్ట్రంలో మూడు తుఫాన్లు వచ్చాయని, రాజకీయ నాయకులమంతా వెళ్లామని, ఆదుకుంటామని చెప్పామని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు 2013 సంవత్సరం ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వడం లేదని వ్యవసాయ మంత్రి చెప్పారని ఆయన అన్నారు. రైతులు సుఖసంతోషాలతో ఉన్నారని చంద్రబాబు అన్నారని, కానీ పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని ఆయన అన్నారు.

హంద్రీనీవా ప్రాజెక్టు గురించి కూడా ఆయన వివరించారు. నీటి పారుదల ప్రాజెక్టులకు చంద్రబాబు ప్రభుత్వం కేటాయించిన నిధులను తెలియజేస్తూ అవి ఎలా పూర్తవుతాయని జగన్ అడిగారు. హంద్రీనీవా, గాలేరి నగరి మీద ప్రేమ ఉన్నట్లు చంద్రబాబు నటిస్తారని, నీటిపారుదలకు కేటాయించిన నిధులను బట్టే మళ్లిస్తారనేది అర్థమవుతోందని ఆయన అన్నారు. హంద్రీనీవాపై చంద్రబాబు ఖర్చు చేసింది కేవలం 16 కోట్లు మాత్రమేనని ఆయన చెప్పారు. హంద్రీనీవా 1100 కోట్ల కేటాయిస్తే పూర్తవుతుందని ఆయన చెప్పారు. గాలేరు నగిరికి వైయస్ 4600 కోట్లు ఖర్చు చేస్తే, చంద్రబాబు కేటాయించింది 17 కోట్ల రూపాయలు మాత్రమేనని ఆయన చెప్పారు.

డ్వాక్రా మహిళల పరిస్థితి దయనీయమైన పరిస్థితులు ఉన్నాయని ఆయన అన్నారు. డ్వాక్రా మహిళా గ్రూపులు ఎవరి హయాంలో పెరిగాయని చూస్తే వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే పెరిగాయని ఆయన చెప్పారు.

డ్వాక్రా మహిళల వద్ద 14 శాతం నుంచి 18 శాతం వడ్డీ వసూలు చేస్తున్నారని ఆయన చెప్పారు. ముక్కు పిండి రుణాలు వసూలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. 18020 కోట్లు కేటాయిస్తే మహిళలకు వడ్డీ లేని రుణాలు అందుతాయని ఆయన అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పరిస్థితి దారుణంగా ఉందని ఆయన అన్నారు. 400 వేల కోట్ల రూపాయలకు పైగా ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. 2 వేల కోట్ల రూపాయలు తక్కుగా ప్రభుత్వం కేటాయింపులు జరిపిందని ఆయన చెప్పారు.

ఉద్యోగాల భర్తీకి డిఎస్సీ, ఎపిపిఎస్సీ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారని ఆయన అడిగారు. 1200 కోట్ల రూపాయల మేరకు పింఛన్లను తగ్గిస్తామని బడ్జెట్ కేటాయింపుల ద్వారా చెబుతున్నారని ఆయన అన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలను చంద్రబాబు నిర్దాక్షిణ్యంగా కొట్టించిందని ఆయన అన్నారు. అంగన్ వాడీ కార్యకర్తల కోసం అసెంబ్లీని స్తంభింపజేశామని, అయినా ప్రభుత్వం స్పందించలేదని ఆయన అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+