జగన్ బిగ్ స్టెప్- గవర్నర్ దృష్టికి అన్ని విషయాలు

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో చోటు చేసుకుంటోన్న దాడులు, ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో భేటీ అయ్యారు. విజయవాడ లోక్‌భవన్‌లో కొద్దిసేపటి కిందటే గవర్నర్‌ను కలిశారు. కొన్ని రోజులుగా పలు ప్రాంతాల్లో చోటుచేసుకుంటోన్న పరిణామాలను వివరించారు. నామినేషన్ల సందర్భంగా తమ పార్టీ అభ్యర్థులపై అధికార తెలుగుదేశం పార్టీ శ్రేణులు భౌతిక దాడులు, అడ్డంకులపై వినతిపత్రం అందజేశారు.

పలు మున్సిపాలిటీలు, వార్డు స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకోవడం, పత్రాలను లాక్కొని చించివేయడం వంటి చర్యలకు పాల్పడుతోన్నారని ఈ సందర్భంగా గవర్నర్‌కు వివరించారాయన. వీటిపై ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా సాగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అభ్యర్థులకు రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమౌతోన్నారని ఆరోపించారు.

YS Jagan Meet Governor SA Nazeer to Raises Alarm and Report Attacks on YSRCP Candidates across State

ఉమ్మడి కడప, చిత్తూరు జిల్లాల్లోని పుంగనూరు, పులివెందుల, రాయచోటి, రాజంపేట, ప్రొద్దుటూరు, కడపల్లో అనేక వార్డుల్లో నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని జగన్ పేర్కొన్నారు. యర్రగుంట్ల, కమలాపురం, బద్వేల్ వంటి ప్రాంతాల్లో కౌన్సిలర్, ఛైర్మన్ స్థానాల అభ్యర్థులకు నామినేషన్ వేయడంలో తీవ్ర ఆటంకాలు ఎదురయ్యాయని గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారు.

పులివెందులలో ఆ పార్టీకి కనీసం 15,000 మెజారిటీ: బెట్టింగ్ రాయుళ్ల భారీ అంచనాలు
పులివెందులలో ఆ పార్టీకి కనీసం 15,000 మెజారిటీ: బెట్టింగ్ రాయుళ్ల భారీ అంచనాలు

భౌతిక దాడులు, కత్తిపోట్ల ఘటనల్లో వైసీపీ నాయకులు తీవ్రంగా గాయపడగా, పులివెందులలో చోటుచేసుకున్న పోలీసుల కాల్పుల్లో ముగ్గురు గాయపడినట్లు వెల్లడించారు. వీటితో పాటు ప్రకాశం జిల్లా దర్శిలో చైర్మన్ అభ్యర్థితో పాటు 25 వార్డులు, అనంతపురం జిల్లా తాడిపత్రిలో నాలుగు వార్డు స్థానాలకు నామినేషన్లు దాఖలు కాకుండా ప్రత్యర్థులు ఆటంకాలు సృష్టించారని వివరించారు.

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల నామినేషన్ దాఖలు చేయడం ప్రతి అభ్యర్థికి రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని ఈ సందర్భంగా వైఎస్ జగన్ అభివర్ణించారు. ఎలాంటి భయాందోళనలు, రాజకీయ ఒత్తిళ్లు లేకుండా అభ్యర్థులందరూ స్వేచ్ఛగా పాల్గొనే వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం, పోలీసు యంత్రాంగంపై ఉందని గుర్తు చేశారు. ఆటంకాలు సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఎన్నికల సంఘం సమర్థవంతంగా వ్యవహరించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+