పవన్ కళ్యాణ్ కోసం ఫైట్, చక్రం తిప్పిన బాబు: దాసరివైపు జగన్ అడుగు తప్పిదమా?

విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి 'కాపు' అంశంపై ఆలస్యంగా రియాక్టయ్యారా? దర్శకరత్న దాసరి నారాయణ రావును ఈ సమయంలో ఎంచుకోవడం తప్పిదమా? అనే చర్చ సాగుతోంది.

మంగళవారం సాయంత్రం జగన్... దాసరి నివాసానికి వెళ్లి కలవడం చర్చనీయాంశమైంది. ఆయనను జగన్ పార్టీలోకి ఆహ్వానించారని, దానికి దాసరి సమయం కావాలని అడిగినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. జగన్ ఇప్పుడు దాసరి రూట్లోకి రావడం పైన కూడా చర్చ సాగుతోంది.

కాపు సామాజిక వర్గాన్ని తమవైపు తిప్పుకునే ఉద్దేశ్యంలో భాగంగా ఇప్పటికే టిడిపి, తెలుగుదేశం పార్టీల మధ్య మాటల యుద్ధం నిన్నటి వరకు కనిపించింది. ఆ సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్‌ను ఎవరికి వారు స్వంతం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

YS Jagan meets Dasari: Will equations change in AP politics?

గత సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం, బిజెపి కలిసి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పోటీ చేశాయి. బిజెపి - టిడిపి కూటమికి పవన్ కళ్యాణ్ జోరుగా ప్రచారం నిర్వహించారు. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వంపై అప్పుడప్పుడు పలువురు బిజెపి నేతలు మండిపడుతున్నారు.

ఇందులో భాగంగా కాపు సామాజిక వర్గాన్ని కూడా బిజెపి దువ్వే ప్రయత్నాలు సాగిందని వార్తలు వచ్చాయి. అయితే, పవన్ కళ్యాణ్ తమకు దూరం కాకుండా చంద్రబాబు చక్రం తిప్పారనే చెప్పవచ్చు. రాజధాని భూములు తదితర కొన్ని అంశాల్లో బిజెపి నేతలు కొందరు టిడిపిపై విమర్శలు చేశారు.

పవన్ కళ్యాణ్ కూడా నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో పర్యటించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దీనిని క్యాష్ చేసుకోవాలని బిజెపి ప్రయత్నాలు చేసిందనే వాదనలు ఉన్నాయి. అయితే, టిడిపి మాత్రం.. పవన్ కళ్యాణ్ మంచి చెప్పారని, ఆయన సూచనలు పాటిస్తామని చెప్పింది.

తద్వారా ఆయనను తమ నుంచి దూరం కాకుండా చేసుకుంది. ఏపీలో 2019 వాటికి కీలక రాజకీయ శక్తిగా ఎదగాలని బిజెపి భావిస్తోంది. ఆ దిశగా పావులు కూడా కదుపుతోంది. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్‌కు సొంతం చేసుకునేందుకు ఓ వైపు బిజెపి, మరోవైపు టిడిపిలు ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చిరంజీవి పైన ఆధారపడింది. ఇలాంటి పరిస్థితుల్లో జగన్.. దాసరిని ఆశ్రయించారనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే మరెంతో కాలం రాజకీయాల్లో ఉండనని చెప్పిన దాసరి వల్ల జగన్‌కు లాభం ఉంటుందా? ఇప్పుడు దాసరి.. జగన్‌కు ఓటు బ్యాంకుగా మారగలరా? అనే చర్చ సాగుతోంది. అయితే, దాసరి ప్రభావం కచ్చితంగా జగన్‌కు లాభిస్తుందని చాలామంది భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+