ఇంత దారుణమా: జగన్ ఆగ్రహం, చంద్రబాబు నా తోక కత్తిరిస్తానన్నారు: దాడిశెట్టి
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం నాడు నిప్పులు చెరిగారు. ఆయన దివిస్ పరిశ్రమ బాధితులను పరామర్శించారు.
రాజమహేంద్రవరం: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం నాడు నిప్పులు చెరిగారు. ఆయన దివిస్ పరిశ్రమ బాధితులను పరామర్శించారు. బాధితులతో ముఖాముఖి నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రభుత్వం ప్రజల గోడు వినే పరిస్థితిలో లేదన్నారు. స్థానిక ప్రజలను పోలీసులు వేధిస్తున్నారన్నారు. స్థానిక ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా పైన 22 కేసులు పెట్టారన్నారు. అలాగే, సీపీఎం మధు పైన దౌర్జన్యం చేశారని చెప్పారు.
దివిస్ పరిశ్రమ ద్వారా ఇరవై వేల మంది ఉపాధిని దెబ్బతీయడం సరికాదన్నారు. గ్రామంలో 82 రోజులుగా 144 సెక్షన్ పెట్టడం విడ్డూరమన్నారు. రైతులను పొట్ట కొట్టడం సరికాదన్నారు. దివిస్ పరిశ్రమను ఫార్మాసిటీకి తరలించాలని డిమాండ్ చేశారు.

నా తోక కత్తిరిస్తానని చంద్రబాబు అన్నారట: దాడిశెట్టి రాజా
దివిస్ పరిశ్రమ బాధితులను జగన్ పరామర్శించి, బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా మాట్లాడారు.
గత 82 రోజులుగా ఇక్కడ 144 సెక్షన్ అమలు చేస్తూ ప్రజలను ఇబ్బందికి గురు చేస్తున్నారన్నారు. దొంగలు, దోపిడీదారులు, కుట్రదారుల మీద ఇలాంటి చర్యలు తీసుకుంటారని, సుమారు 670 ఎకరాలను ప్రభుత్వం దోచుకుంటుంటే ఇవ్వబోమన్నందుకు ప్రజలను ఇబ్బంది పెడుతున్నారన్నారు.
ఈ భూమి తప్ప వేరే దారి లేదని ప్రజలు చెప్పినా వినడం లేదన్నారు. పోలీసులు రెండు ఎకరాల భూమిని కాపాడుకోలేకపోతున్నారు కానీ, పేద ప్రజల భూములను లాక్కోవడానికి ముందుంటారని దుయ్యబట్టారు. ఇక్కడకు దగ్గరలోనే ఓ స్మశానం ఉందని, దానిని కూడా టిడిపి నాయకులు ఆక్రమించారన్నారు.
అలాంటి వారి పైన కాకుండా, అమాయకుల పైన పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారన్నారు. చంద్రబాబు మాత్రం వైసిపి నాయకులు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ప్రచారం చేస్తున్నారన్నారు. ఎకరం రూ.35 లక్షల విలువతో ఈ భూమి మొత్తం రూ.670 కోట్ల విలువ చేస్తుందని, దానిని రూ.40 కోట్లకే చంద్రబాబు తన వాళ్లకు కట్టబెడుతున్నారన్నారు.
చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 30 నెలల్లో రాష్ట్రంలో ఏదైనా పరిశ్రమ వచ్చిందా చెప్పాలని నిలదీశారు. కొత్తగా ఉద్యోగాలు ఇచ్చారా అని మండిపడ్డారు. తుని ఎమ్మెల్యే తోక కోస్తానని ఇటీవల విజయవాడలో ఓ నాయకుడిని చేర్చుకునే సందర్భంలో చంద్రబాబు అన్నారని, అలాంటి వ్యాఖ్యలు ఆయనకు తగవన్నారు.












Click it and Unblock the Notifications