'కన్నీళ్ల' పరిస్థితిని మార్చేస్తా.. సొంతిల్లు ఇక్కడే కొనుక్కుంటా:జగన్

చంద్రబాబు ఇక్కడి రైతుల కళ్లల్లో కన్నీళ్లు చూస్తున్నారని,భవిష్యత్తులో ఈ పరిస్థితిని తాను మార్చేస్తానని భరోసా ఇచ్చారు.

నిడమర్రు: పోలీసులు విధించిన ఆంక్షల నడుమే ఏపీ ప్రతిపక్ష అధినేత జగన్ అమరావతి గ్రామాల పర్యటన కొనసాగుతోంది. రైతుల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఎండగడుతూ.. ప్రజారాజధానిని నిర్మించాలంటే వైసీపీ అధికారంలోకి రావాలని జగన్ తన ప్రసంగం ద్వారా ప్రస్తావిస్తున్నారు.

అమరావతి గ్రామాల పర్యటనలో భాగంగా.. గుంటూరు జిల్లా నిడమర్రులో రైతులను ఉద్దేశించి జగన్ మాట్లాడారు. రాబోయే రోజుల్లో అమరావతిలో సొంత నివాసం ఏర్పరుచుకుంటానని ఈ సందర్బంగా జగన్ అన్నారు. చంద్రబాబు అద్దె ఇంట్లో ఉంటున్నారని, తాను మాత్రం సొంతిల్లు కొనుక్కొని ఇక్కడే ఉంటానని చెప్పుకొచ్చారు.

సొంతిల్లు ఇక్కడే కొనుక్కుంటానని జగన్ చెప్పడంతో అక్కడి ప్రజలంతా చప్పట్లతో హర్షం వ్యక్తం చేయడం గమనార్హం. తమ పార్టీ ద్వారానే రాజధాని వాసులకు మేలు జరుగుతుందన్నారు జగన్. చంద్రబాబు ఇక్కడి రైతుల కళ్లల్లో కన్నీళ్లు చూస్తున్నారని,భవిష్యత్తులో ఈ పరిస్థితిని తాను మార్చేస్తానని భరోసా ఇచ్చారు.

YS Jagan Mohan Reddy speech in his visit of nidumarru

రాజధాని రైతులందరికీ తాను అండగా నిలుస్తానని, వారికి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరకుండా చూస్తానని జగన్ చెప్పారు. మరో రెండేళ్ల పాటు రైతులు తమ భూములను కాపాడుకోగలిగితే చాలని, ఆ తర్వాత తమ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని, అప్పుడు వారంతా నిశ్చింతగా ఉండవచ్చునని తెలిపారు.

ఇక తన పర్యటనపై ఆంక్షలు విధించడాన్ని ప్రస్తావిస్తూ.. ఇదో సిగ్గుచేటు వ్యవహారమన్నారు జగన్. బలవంతంగా భూములు లాక్కోబోమని ల్యాండ్ పూలింగ్ సమయంలో చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడేమో బలవంతంగా భూసేకరణ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

'ఏ గ్రామాలకైతే తాను వెళ్లకుండా ఆంక్షలు విధించారో.. ఆ గ్రామాల ప్రజలే ఇక్కడి వరకు వచ్చారు. మీరు పడుతున్న ఇబ్బందులను మీ నోటితోనే వెల్లడించండి. అప్పుడైనా చంద్రబాబుకు బుద్ది, జ్జానం వస్తుందేమో?' అంటూ సీఎం చంద్రబాబు తీరును జగన్ దుయ్యబట్టారు. మీ పోరాటానికి వైసీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని హామి ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+