వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డికి స్వల్ప అస్వస్థత, వర్షంలో తడుస్తూ.. విరామమెరుగని ప్రచారం వల్లే..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. 13 రోజుల పాటు నంద్యాల నియోజకవర్గంలో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఆయన అనేక రోడ్ షోల్లో పాల్గొన్నారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ ఉపఎన్నిక ప్రచారంలో విస్తృతంగా పర్యటించిన జగన్ మోహన్ రెడ్డి సోమవారం రాత్రికి హైదరాబాద్ చేరుకున్నారు.

13 రోజుల పాటు నంద్యాల నియోజకవర్గంలో ఆయన అనేక రోడ్ షోల్లో పాల్గొన్న విషయం తెలిసిందే. చివరి రెండు రోజుల్లో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఆయన రోడ్ షోల్లో పాల్గొనడమే కాకుండా వ్యక్తిగతంగా ఎంతోమందిని పలకరించారు.

ys-jagan

ప్రచారం ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న తర్వాత ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం జలుబు, జ్వరంతో బాధపడుతున్నారు. ఏమాత్రం విశ్రాంతి లేకుండా విస్తృతంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కారణంగా జలుబు, జ్వరం వచ్చిందని, కొద్దిరోజుల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. దాంతో గురువారం పార్టీ నాయకులను కూడా పెద్దగా కలుసుకోలేదు.

శుక్రవారం వినాయక చవితి పండుగను పురస్కరించుకుని జగన్ మోహన్ రెడ్డి తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక సందేశం పంపించారు. భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఈ పండుగ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ విజయాలు చేకూర్చాలని ఆయన ఆకాంక్షించారు. అభివృద్ధి పరంగా ఇరు రాష్ట్రాలకు విఘ్నాలు తొలగి ఇకమీదట అన్నీ విజయాలే సిద్ధించాలని ఆ సందేశంలో ఆయన కోరుకున్నారు.

English summary
YCP Chief YS Jagan Mohan Reddy is now suffering from severe cold and fever. During the Nandyal Bypoll publicity campaign, Jagan participated in many road shows in the constituency from the last 13 days. Due to contineous campaign, restlessness.. after returning to hyderabad.. he fallen sick.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X