గాంధీగిరి మొదలుపెట్టిన జగన్‌రెడ్డి!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ చేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే వైసీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని, ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం వచ్చిందనేది ఈ ట్వీట్ లో సారాంశం. ఫలితాలు వెల్లడైన తర్వాత ఒకటి, రెండు సంఘటనలను బూచిగా చూపించి వ్యవస్థలు కుప్పకూలయని జగన్ పేర్కొనడం ఆశ్చర్యంగా ఉందని తెలుగుదేశం పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ప్రజాస్వామ్యం గురించి, వ్యవస్థల గురించి జగన్ రెడ్డి మాట్లాడటం ఆశ్చర్యకరంగా ఉందని టీడీపీ నాయకులు అంటున్నారు.
నిర్ద్వంద్వంగా జగన్‌ను తిరస్కరించారు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రతిరోజు ప్రత్యర్థి పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలపై దాడులు జరగడంతోపాటు నిత్యం వేధింపులు చోటుచేసుకున్నాయని, రాష్ట్రంలో ప్యాక్షన్ వాతావరణాన్ని మళ్లీ పరిచయం చేశారంటూ మండిపడ్డారు. జగన్ విధానాలపై విసుగుపుట్టిన ప్రజలు ఆ పార్టీని నిర్ద్వంద్వంగా తిరస్కరించారని, నూతన ప్రభుత్వం ఇంకా బాధ్యతలు చేపట్టలేదని, ఓవైపు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని, పూర్తిగా ప్రభుత్వం కొలువు తీరకుండానే టీడీపీపై నిందలు మోపడం జగన్ ప్రారంభించాడంటున్నారు.

రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. చంద్రబాబు రాజకీయ కక్షసాధింపులతో ప్రజాస్వామ్యానికే పెనుముప్పు వచ్చింది. టీడీపీ యథేచ్ఛదాడులతో ఆటవిక పరిస్థితులు తలెత్తాయి. యంత్రాంగం మొత్తం నిర్వీర్యం అయిపోయింది. వైయస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపైనా ఉన్మాదంతో దాడులు చేస్తున్నారు.…
— YS Jagan Mohan Reddy (@ysjagan) June 7, 2024
అదుపు తప్పిన వ్యవస్థలు
వైసీపీ అధికారం కోల్పోయిన వెంటనే రాష్ట్రంలో వ్యవస్థలు అదుపు తప్పాయని జగన్‌రెడ్డి వ్యాఖ్యానిస్తే దానిని ప్రజలు విశ్వసిస్తారా..? అని ప్రశ్నిస్తున్నారు. వైసీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయంటూ గగ్గోలు పెడుతున్న జగన్ తాను అధికారంలో ఉన్న సమయంలో ఎప్పుడైనా కార్యకర్తల గురించి పట్టించుకున్నారా? అంటూ నిలదీస్తున్నారు.
అధికారం పోయిన తర్వాత ప్రజాస్వామ్యం గురించి, కార్యకర్తల గురించి మాట్లాడుతుంటే చాలా ఆశ్చర్యమేస్తోందని, జగన్ తీరుపై వైసీపీలోనే విమర్శలు వ్యక్తమవుతున్నాయంటున్నారు. జగన్ రెడ్డి లాంటి ఫ్యాక్షన్ మనస్తత్వం ఉన్న వ్యక్తి ట్వీట్ చేయడమంటే గాంధీగిరి చేసినట్లుందని సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.












Click it and Unblock the Notifications