జగన్ కొత్త గేమ్ - అక్కడే మొదలు, హిస్టరీ రిపీట్..!!

ఏపీలో రాజకీయం కొత్త టర్న్ తీసుకుంటోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు పూర్తి చేసు కుంది. అధికారికంగా ప్రతిపక్ష హోదా లేని వైసీపీ ఇక కూటమి ప్రభుత్వం లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్లా లని నిర్ణయించింది. ఇందు కోసం ఇప్పటికే మూడు ప్రధాన అంశాల పైన నిరసనలకు నిర్ణయం తీసుకుంది. మాజీ సీఎం జగన్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు గుణపాఠంగా మారాయి. దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. ఇక.. ప్రజలు .. పార్టీ కేడర్ తో మమేకం కానున్నారు. ఇందు కోసం కొత్త ప్లాన్ సిద్దం చేసారు. ఇందుకు ముహూర్తం ఖరారైంది.

అనంత నుంచి ప్రారంభం
మాజీ సీఎం జగన్ కూటమి ప్రభుత్వం పైన పోరుబాటకు సిద్దమయ్యారు. జగన్ పార్టీ ఏర్పాటు నుంచి అండగా నిలిచిన సీమ గడ్డ నుంచే తన పోరాటం ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ నెల 13న రైతు సమస్యల పై రాష్ట్ర వ్యాప్త నిరసనలకు వైసీపీ నిర్ణయించింది. అందులో భాగంగా జగన్ అనంతపురం నిరసనలో పాల్గొనున్నారు. కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఇందు కోసం పెద్ద సంఖ్యలో రైతులు .. పార్టీ శ్రేణులు పాల్గొనేలా సన్నాహాలు చేస్తున్నారు. జగన్ ఈ ర్యాలీ నుంచి ప్రభుత్వం నుంచి సమరశంఖం పూరించనున్నారు. రైతులకు ఇస్తామని చెప్పిన రూ 20 వేల తో పాటుగా రైతు అంశాల పైన ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్దమయ్యారు.

YS jagan moving with new sketch against Chandra Babu planning for big rallies in Rayalaseema

దిద్దుబాటు చర్యలు
తొలి నుంచి జగన్ కు రాయలసీమలోనూ నాలుగు ఉమ్మడి జిల్లాలు మద్దతుగా నిలిచాయి. కానీ, తాజా ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వచ్చాయి. అనంతపురం జిల్లాలో వైసీపీకి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పుడు జగన్ తిరిగి జనంలోకి వెళ్లటం ద్వారా గతంలో వచ్చిన ఆదరణ తిరిగి వస్తుందనే అంచనాతో ఉన్నారు. ఎన్నికల్లో 40 శాతం ఓటింగ్ దక్కటంతో ప్రజల్లో తన పైన ఇంకా నమ్మకం ఉందని.. పది శాతం ఓట్లు కూటమి ఇచ్చిన హామీల కారణంగానే తగ్గిందని విశ్లేషణలు చేస్తున్నారు. దీంతో, 2019 ఎన్నికల ముందు జగన్ నాటి చంద్రబాబు ప్రభుత్వం పైన హామీలు అమలు చేయలేదంటూ ప్రజల మధ్యకు వెళ్లారు. తాను అధికారంలోకి వస్తే ఏం చేస్తానో వివరించారు. ఫలితంగా 2019 ఎన్నికల్లో జగన్ 151 సీట్లు సాధించారు.

మూడు ప్రాంతాలపై జగన్ గురి
అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీ నేతలు .. కేడర్ .. ప్రజలతో జగన్ ను ప్రత్యక్ష సంబంధాలు తెగి పోయాయి. పార్టీ ఎమ్మెల్యేలు .. ప్రజలు కలిసే అవకాశం లేకుండా పోయింది. పార్టీ - ప్రభుత్వ పరంగా తీసుకున్న నిర్ణయాలు బూమ్ రాంగ్ అయ్యాయి. ఫలితంగా 11 సీట్లకే పరిమితం అవ్వాల్సి వచ్చింది. దీంతో, ఫలితాల తరువాత పార్టీ నేతలతో వరుస సమీక్షలు చేసిన జగన్.. తన తప్పుల ను గుర్తించారు. ఇక.. ప్రతీ అసెంబ్లీలోని పార్టీ శ్రేణులతో ముందుగా సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నారు. జనవరి మూడో వారంలో జిల్లాల పర్యటనలు ప్రారంభం కానున్నాయి. వీటికి ముందుగానే ప్రజల్లో ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకత.. తమ పైన ఉన్న నమ్మకం మరోసారి నిరూపించాలని జగన్ భావిస్తున్నారు. అందులో భాగంగా మూడు నిరసనల్లో మూడు ప్రాంతాల్లో జగన్ పాల్గొనేలా ప్లాన్ చేసారు. మరి.. జగన్ అంచనాలకు తగినట్లుగా ప్రజల నుంచి మద్దతు ఉంటుందా లేదా అనేది ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+