సెటైర్లు: సీఆర్డీఏలో ఏవీ లేవన్న జగన్, ట్రెయినింగ్ తీసుకోవాలని బాబు

హైదరాబాద్: మంత్రి నారాయణ సోమవారం శాసన సభలో సీఆర్డీఏ బిల్లు ప్రవేశ పెట్టిన తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మధ్య వాగ్వాదం జరిగింది. మంత్రి యనమల రామకృష్ణుడు, ఇతరులు కూడా మధ్యలో కల్పించుకున్నారు.

బిల్లు ప్రవేశ పెట్టిన నారాయణ

మంత్రి నారాయణ సీఆర్డీఏ బిల్లు ప్రవేశపెడుతూ... రాష్ట్ర విభజన లోపభూయిష్టంగా జరిగిందన్నారు. తెలుగు ప్రజలు గర్వపడేలా రాజధాని ఉంటుందని చెప్పారు. ఏపీకి కొత్త రాజధాని నిర్మించాల్సి ఉందన్నారు. రాజధాని ప్రాంతంలోని అన్ని వ్యవస్థలు యథావిధిగా కొనసాగుతాయని, అయా వ్యవస్థలు సీఆర్డీఏకు రిపోర్ట్ చేస్తాయన్నారు. ఈ సందర్భంగా రైతులకు ఏమిస్తామో చెప్పారు.

Chandrababu Naidu - YS Jagan

బిల్లులో నారాయణ చెబుతున్నవేవీ లేవు: జగన్

సీఆర్డీఏ బిల్లులో నారాయణ చెబుతున్నవేవీ లేవని వైయస్ జగన్ అన్నారు. బిల్లులో ఏం లేకుండా అది చేస్తాం, ఇది చేస్తామంటే తాము ఎలా ఓటేయాలన్నారు. బిల్లుకు అర్థమేముందన్నారు.

చదివితే అర్థమవుతుంది: యనమల

సిఆర్డీఏ బిల్లును చదివితే ప్రతిపక్ష నేతలకు అర్థమవుతుందని, అర్థం కానోళ్లు ఉంటారనే తాము అర్థమయ్యేట్లు చెబుతున్నామని, బిల్లును జగన్ పూర్తిగా చదవాలని, మంత్రిగారు చెబితే వినే ఓపిక వారికి లేదని, ఒరిజినల్ కాన్సెప్ట్ వారు చదువుతున్నారని, రూల్స్ కూడా వస్తాయన్నారు.

ఏ పేజీలో ఉన్నాయో చెప్పండి: జగన్

మీరు చెప్పినవి ఏ పేజీలో ఉన్నాయో చెప్పాలని, 120 పేజీల డాక్యుమెంట్ ఉందని, రైతులకు, కౌలు రైతులకు ఇంతిస్తామని ఏ పేజీలో ఉన్నాయో చెప్పాలని జగన్ అన్నారు.

ప్రతిపక్ష నేతకు ట్రెయినింగ్ క్లాసులు కావాలి: చంద్రబాబు

ప్రతిపక్ష నేతకు(జగన్) ట్రెయినింగ్ క్లాసులు పెట్టాలని, ఈ సభకు కొత్తవాళ్లు చాలామంది వచ్చారని చంద్రబాబు అన్నారు. బిల్లు అంటే తెలియదు, రూల్స్ అంటే తెలియదు, ప్రొసీజర్ అంటే తెలియదని ఎద్దేవా చేశారు. బిల్లు అంటే శాశ్వతంగా ఉండేదన్నారు. ముప్పై ఏల్లు రాజకీయాలు చేశానని, సభాపతి గారు ఆరోసారో లేక ఏడోసారో అన్నారు. అసెంబ్లీ రూల్స్ చదువుకొని ప్రతిపక్ష సభ్యులు రావాలన్నారు. ప్రతిపక్ష నేతకు ఇంకా కొన్ని ట్రెయినింగ్స్ కావాలన్నారు బిల్లు అంటే ఏమిటో తెలుసుకునేందుకు అసెంబ్లీ రూల్స్ చదవాలన్నారు.

ప్రపంచానికి ట్యూషన్లు చెప్పానంటే ఏమో అనుకున్నా: జగన్

చంద్రబాబు తొమ్మిదేళ్లు రాష్ట్రాన్ని పాలించారంటే, ఎంతో తెలివి తేటలు ఉన్నాయనుకున్నానని, ప్రపంచానికి ట్యూషన్లు చెబుతారనుకున్నానని ఎద్దేవా చేశారు. బిల్లు రావాలంటారు, అది వస్తే రూల్స్ అంటారు. అసలు రైతులకు, కౌలు రైతులకు ఎంతిస్తారో చెప్పలేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+