బాలకృష్ణ ఇంట్లో కాల్పులను సభలో జగన్ ప్రస్తావన, రోజా ఆగ్రహం

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం నాడు ఏపీ శాసన సభలో హీరో, హిందూపురం శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ ఇంట్లో కాల్పుల అంశాన్ని ప్రస్తావించారు. సభలో చర్చ సమయంలో తమకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు.

ఈ సందర్భంగా మాట్లాడారు. అధికార పార్టీ ప్రతిపక్ష సభ్యుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. ఆరోపణల పైన సమాధానం చెప్పే అవకాశం తమకు ఇవ్వడం లేదని మండిపడ్డారు. ప్రశ్న, జవాబు.. రెండు కూడా అధికార పార్టీయే చెప్పుకుంటోందన్నారు. టీడీపీ నేతలు నోటికొచ్చిన అబద్దాలాడుతున్నారు.

YS Jagan raises Balakrishna issue in Assembly

తమ ఎమ్మెల్యేలకు మా్లాడేందుకు ఏమాత్రం అవకాశం ఇవ్వడం లేదని చెప్పారు. నోటికొచ్చినట్లు అబద్దాలు ఆడారని ధ్వజమెత్తారు. ఓ సందర్భంలో జగన్.. బాలకృష్ణ ఇంట్లో కాల్పుల అంశాన్ని ప్రస్తావించారు. అంతేకాదు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికల పేర్లను కూడా ప్రస్తావించారు. దీని పైన తెలుగుదేశం పార్టీ సభ్యులు అభ్యంతరం తెలిపారు.

సభలో టీడీపీ సభ్యులు మాట్లాడుతూ.. రాయలసీమ రాగాల సీమ, అనురాగాల సీమ అన్నారు. అంతకుముందు వైసీపీ ఎమ్మెల్యే రోజా మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. ఓ ఛానల్ వారికి ఇచ్చి అధికార పార్టీ ఏం చూపించమంటే అది చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆడపడుచులంటే టీడీపీకి చులకన భావమని మండిపడ్డారు. కాగా, రోజా దురుసుగా ప్రవర్తించారని సభాహక్కుల కమిటీకి టీడీపీ ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదును రాష్ట్ర స్పీకరు కోడెల శివప్రసాదరావు ప్రివిలేజ్‌ కమిటీకి రిఫర్‌ చేశారు. ప్రివిలేజ్‌ కమిటీ విచారణ జరిపి చర్య తీసుకుంటుందని స్పీకర్‌ పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+