జగన్ పాదయాత్రకు ఏర్పాట్లు: 'వైయస్ హయంలో ఎక్కువ లబ్ధి పొందింది ఆయనే'
వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు పార్టీ ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. బుధవారం నేతలు ఇడుపులపాయలో ఏర్పాట్లను పరిశీలించారు. గురువారం అధినేత... నేతలతో భేటీ అయ్యారని తెలుస్తోంది.
అమరావతి: వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు పార్టీ ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. బుధవారం నేతలు ఇడుపులపాయలో ఏర్పాట్లను పరిశీలించారు. గురువారం అధినేత... నేతలతో భేటీ అయ్యారని తెలుస్తోంది.
Recommended Video


బీసీలను ఓటు వేసే యంత్రాలుగా
బీసీల ఓట్లతో అధికారం చేపట్టిన టీడీపీ ప్రభుత్వం సంక్షేమాన్ని విస్మరించిందని వైసిపి బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు జంగ కృష్ణమూర్తి బుధవారం కర్నూలులో విమర్శించారు. బీసీలను కేవలం ఓట్లువేసే యంత్రాలుగా చూస్తున్నారని, 2014 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నేటికీ నెరవేర్చలేదన్నారు.

టీడీపీ వైఫల్యాలను ప్రచారం చేయాలి
టీడీపీ హయాంలో బీసీల ఆర్థిక స్థితిగతుల్లో ఎలాంటి మార్పు రాలేదని కృష్ణమూర్తి అన్నారు. వెనుకబడిన తరగతుల్లో కొన్ని కులాలను ఎస్టీల్లో చేరుస్తామన్న ప్రభుత్వం బీసీ ఫెడరేషన్ ఏర్పాటు చేసి గొప్పలు చెప్పుకుంటోందన్నారు. టీడీపీ వైఫల్యాలను ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.

జగన్‌కు వినతిపత్రాలు ఇవ్వాలి
జగన్ చేపట్టనున్న ప్రజాసంకల్ప పాదయాత్రకు ప్రజలు ఘనస్వాగతం పలకాలని, ఏవైనా సమస్యలుంటే వినతిపత్రాలను అందించాలని కృష్ణమూర్తి అన్నారు. ఈ యాత్ర పూర్తయ్యాక బీసీ గర్జన నిర్వహిస్తామన్నారు.

వైయస్ హయాంలో ఎక్కువ లబ్ధి పొందిన వ్యక్తి
జగన్‌ను విమర్శించే అర్హత పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డికి లేదని విమర్శించారు. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో అందరికంటే ఎక్కువగా లబ్ధిపొందిన వ్యక్తి రఘువీరా అని అలాంటి వ్యక్తి జగన్ పైన ఈ రకంగా విమర్శలు చేయడం సరికాదని మండిపడ్డారు.
-
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications