సిపిఎంకు వైయస్ జగన్ షాక్: పొత్తుకు విముఖత

హైదరాబాద్: వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో పొత్తు పెట్టుకుందామనే సిపిఎం ఆశలు గల్లంతయినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీకి, సిపిఐకి దూరం జరుగుతూ సిపిఎం వైయస్సార్ కాంగ్రెసు వైపు మొగ్గు చూపుతూ వచ్చింది. ఎన్నికల తర్వాత ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీతో వెళ్లడానికి వెసులుబాటు ఉంచుకోవడానికే జగన్ సిపిఎంకు దూరమైనట్లు తెలుస్తోంది. సిపిఎంతో వెళ్తే తృతీయ కూటమిలో ఉండాల్సి వస్తుందనే ఆలోచనే జగన్‌ను వెనక్కి లాగినట్లు చెబుతున్నారు.

కాంగ్రెసు, బిజెపియేతర పార్టీలతో పొత్తుకు సిద్ధమంటూ, ఆ జాబితాలో వైయస్సార్ కాంగ్రెసు ఉందని సిపిఎం నాయకులు చెబుతూ వచ్చారు. తృణమూల్ కాంగ్రెసు అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బాటలో నడవాలనే ఉద్దేశంతో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో మమతా బెనర్జీకి బద్దశత్రువైన సిపిఎంతో జగన్ పొత్తుకు సిద్ధంగా లేరని చెబుతున్నారు.

YS Jagan rejects make alliance with CPM

సిపిఎం సమైక్యవాదం వైయస్సార్ కాంగ్రెసుకు కలిసొచ్చేదిగా ఉన్నా ఇంతవరకు ఆ పార్టీనుంచి సానుకూల స్పందన లేదు. పైగా, తెలంగాణలో సిపిఎంతో కలిసి పాగా వేయాలని ఒక సందర్భంలో జగన్ అనుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే, ఎన్నికల తర్వాత అవసరమైతే బిజెపితో వెళ్లడానికి లేదా మమతా బెనర్జీతో కొనసాగడానికి వీలుగానే జగన్ సిపిఎంతో పొత్తుకు సిద్ధంగా లేరని అంటున్నారు.

పోలవరం ప్రాజెక్టు డిజైన్ మార్చాలంటూ సిపిఎం వాదిస్తుండడాన్ని సర్దుబాటుకు అడ్డంకిగా వైయస్సార్ కాంగ్రెసు నాయకులు చెబుతున్నట్లు తెలుస్తోంది. కాగా, పోలవరం డిజైన్ మార్పు విషయంలో తమ వైఖరి మార్చుకునే ప్రసక్తే లేదని సిపిఎం నేతలు చెబుతున్నారు. సీమాంధ్రలో నామినేషన్ల పర్వానికి ఇంకా కొద్ది సమయం ఉన్నందున పొత్తులపై సిపిఎం సీమాంధ్ర కమిటీ వేచి చూసే ధోరణిలో ఉంది.

తెలంగాణ కమిటీ మాత్రం ఇప్పటికే ఐదు అసెంబ్లీ, మూడు పార్లమెంటు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించి స్వతంత్రంగా ముందుకు పోతోంది. మంగళవారం నాడు తుది జాబితా విడుదల చేయడానికి సన్నద్ధమైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+