వైఎస్‌పై దూళిపాళ్ల వ్యాఖ్య: ధీటుగా జగన్ రిప్లై

హైదరాబాద్: వైయస్ రాజశేఖర రెడ్డిపై నిందలు వేయడం సరి కాదని ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అన్నారు. సభకు రాలేని వ్యక్తి గురించి మాట్లాడడం సమంజసమా అని ఆయన అడిగారు. ప్రభుత్వం మంచి పనులు చేస్తే సమర్థిస్తామని ఆయన అన్నారు.

బ్రాహ్మణి స్టీల్స్‌కు భూమి కేటాయింపు గురించి తెలుగుదేశం పార్టీ సభ్యుడు ధూళిపాళ్ల నరేంద్ర చౌదరి ప్రస్తావించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సోమవారం ప్రసంగిస్తూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు.

YS Jagan retaliates TDP comments

అభివృద్ధిని కోరుకునే ప్రతి ఒక్కరూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంట నడిచారని నరేంద్ర అన్నారు. రైతు సమస్యలపై చంద్రబాబు నిరవధిక పోరాటం చేశారని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలుగుతున్న సమయంలో చంద్రబాబు పోరాడారాని ఆయన గుర్తు చేశారు. విపక్షంలో ఉన్నప్పుడు ప్రజాప్రయోజానాలను కాపాడేందుకు ప్రయత్నించామని చెప్పారు.

రాష్ట్ర ప్రజానీకాన్ని కాపాడేందుకు 65 ఏళ్ల వయస్సులో చంద్రబాబు పాదయాత్ర చేపట్టారని గుర్తు చేశారు. కాంగ్రెసు పార్టీ అనాలోచిత నిర్ణయాలు ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెట్టాయని ఆయన మండిపడ్డారు. రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో తమపై గురుతరమైన బాధ్యత ఉందని ఆయన చెప్పారు. అందరం కలిసికట్టుగా పనిచేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని సూచించారు.తాను విధానాలపై మాత్రమే మాట్లాడుతున్నానని ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. గేలాక్సీ గ్రైనైట్ తదితర విషయాలను ఆయన ప్రస్తావించారు. ఓబులాపురం మైనింగ్ వ్యవహారాన్ని ఆయన గుర్తు చేశారు. భూముల కేటాయింపులపై విచారణ జరిపించాల్సిందేనని ఆయన అన్నారు. ప్రజలు చాలా కష్టాల్లో ఉన్నారని, ప్రజలు ప్రభుత్వం వైపు ఆశగా చూస్తున్నారని జగన్ అన్నారు. రాష్ట్ర సమస్యలపై మాట్లాడాలని ఆయన సూచించారు.

దివంగత నేత గురించి పదే పదే మాట్లాడడం సిగ్గుచేటు అని జగన్ అన్నాపు. రాష్ట్రాభివృద్ధికి తాము సూచనలు చేస్తామని ఆయన చెప్పారు. రక్షణ స్టీల్స్ ఎవరిది, దాని వెనక ఉన్నది ఎవరు అని నరేంద్ర చౌదరి ప్రశ్నించారు. గత ప్రభుత్వాలు ఎలా పనిచేశాయో గుర్తు చేస్తే తప్పేమిటని ఆయన అన్నారు. ధూళిపాళ్ల నరేంద్ర చౌదరి వ్యాఖ్యలపై జగన్ తీవ్రంగా మండిపడ్డారు.

గతంలో ముఖ్యమంత్రులుగా ఉన్నవారు, వారి కుటుంబ సభ్యులు క్విడ్ ప్రోకో కింద రాష్ట్రాదాయానికి నష్టం కలిగించారని నరేంద్ర చౌదరి అన్నారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఇష్టానుసారంగా వాడుకుని మనం కోటీశ్వరులయ్యామని ఆయన అన్నారు. ప్రజలు టాటా బిర్లాలు కోటీశ్వరులు కాలేదు గానీ అధికారంలో ఉన్నవారి, వారి కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు కోటీశ్వరులయ్యారని ఆయన అన్నారు.

దోపీడి విధానాల వల్ల నష్టం జరిగినవాటని సవరించాలని, దోపిడీ సొమ్మును రాష్ట్ర ఖజానాకు దక్కేలా అవసరమైతే చట్టాలను సవరించాలని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+