బెంగళూరు కేంద్రంగా జగన్ ఆపరేషన్ అమరావతి..!!

ఏపీలో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. కొత్త ప్రభుత్వం హామీల అమలు..పాలనా పరంగా ప్రక్షాళనతో నిర్ణయాలు తీసుకుంటోంది. ఇటు ఎన్నికల్లో పరాజయం తరువాత మాజీ ముఖ్యమంత్రి జగన్ వరుసగా పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహించారు. తరువాత బెంగళూరులో మకాం వేసారు. అక్కడ జగన్ ఏం చేసారనేది రాజకీయంగా ఆసక్తిని పెంచింది. ఇప్పుడు తాడేపల్లికి జగన్ తిరిగి వస్తూనే పార్టీ నేతలతో కీలక సమావేశం ఏర్పాటుకు నిర్ణయించారు.

తాడేపల్లికి జగన్
మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రస్తుతం బెంగళూరులో ఉన్నారు. ఎన్నికల ఫలితాల తరువాత పలు జిల్లాలకు చెందిన పార్టీ నేతలు జగన్ ను కలిసారు. వారిలో విశ్వాసం పెంచేలా జగన్ ప్రయత్నం చేసారు. పార్టీ కేడర్ పైన దాడులు జరుగుతున్నాయని..వారికి అండగా నిలవాలని సూచించారు. తాను త్వరలో ప్రజల్లోకి వస్తానని చెప్పారు. 2019 ఎన్నికల ముందు 14 నెలలు పాదయాత్ర చేసిన అంశాన్ని గుర్తు చేసిన జగన్ ప్రజల తరపున పోరాటం చేయటానికి సిద్దమన్నారు. పాదయాత్ర చేసే వయసూ, సత్తా తనకు ఉందని చెప్పారు.

YS Jagan Return to Tadepalli from Bangalore on Tuesday call for party meeting

ఓటమి కారణాలు
చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేస్తామని చెబుతున్నారని..కొంత సమయం వరకు వేచి చూద్దామని పార్టీ నేతలకు నిర్దేశించారు. ఆ తరువాత ప్రజల తరపున పోరాటాలు చేద్దామన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా పైన స్పీకర్ కు జగన్ లేఖ రాసారు. దీని పైన స్పందించిన ప్రభుత్వం తాము ప్రతిపక్ష హోదా లేకుండా చేయలేదని..ప్రజలే ఇవ్వలేదని స్ఫష్టం చేసింది. సంఖ్య బలం ఆధారంగా జగన్ కు ప్రతిపక్ష హోదా రాదని తేల్చి చెప్పింది. ఇదే సమయంలో బెంగళూరు కేంద్రంగా జగన్ ఓటమికి కారణాలతో పాటుగా భవిష్యత్ కార్యాచరణ పైన ప్రణాళికలు సిద్దం చేసినట్లు తెలుస్తోంది.

కీలక మార్పులు
బెంగళూరు నుంచి వచ్చిన తరువాత వరుస సమీక్షలకు జగన్ సిద్దం అవుతున్నారు. అమరావతి కేంద్రంగానే పార్టీ సమీక్షలు నిర్వహిస్తూ..పార్టీ బాధ్యతల్లో మార్పులు చేస్తారని సమాచారం. అదే విధంగా పార్టీ అనుబంధ సంఘాలతో సమావేశాలు నిర్వహించనున్నారు. జిల్లాల వారీగా వరుసగా పార్టీ నేతలు..కేడర్ తో సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఓటమికి కారణాల పైన ఒక స్పష్టతకు వచ్చిన జగన్..పార్టీ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాల పైన ముందుగా కార్యాచరణ ప్రారంభించనున్నారని ముఖ్య నేతల సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+