లోకేష్ అవినీతిని మిథున్ అడ్డుకున్నారు, అందుకే కేసు: జగన్ షాకింగ్
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం తీవ్రంగా నిప్పులు చెరిగారు. ఆయన జైలులో ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డిలను పరామర్శించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు డైరెక్షన్‌లో కుట్రలు సాగుతున్నాయని ఆరోపించారు. తమను రాజకీయంగా ఎదుర్కోలేని చంద్రబాబు అధికారాన్ని అడ్డం పెట్టుకుని దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఆయన ఆదేశాలకు అనుగుణంగా పోలీసులు వైసిపి నేతలను అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు.

కేసుల పేరుతో తమ పార్టీ వారిని లక్ష్యంగా చేసుకుంటూ నీచమైన రాజకీయాలకు చంద్రబాబు ప్రభుత్వం పాల్పడుతోందన్నారు. నారా లోకేష్ చేస్తున్న అవినీతిని అడ్డుకున్న కారణంతోనే మిథున్ రెడ్డి పైన తప్పుడు కేసులు పెట్టారని ధ్వజమెత్తారు.
విమానాశ్రయంలో మిథున్ రెడ్డి తప్పు ఉంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఎందుకు కేసు పెట్టలేదని ప్రశ్నించారు. చంద్రబాబు డైరెక్షన్ మేరకే వైసిపి నేతల పైన కుట్రలు జరుగుతున్నాయన్నారు. టీడీపీ ఆగడాలను ప్రజా క్షేత్రంలో అడ్డుకుంటామన్నారు. చంద్రబాబుకు త్వరలో ప్రజలు బుద్ధి చెబుతారన్నారు.
-
YS Sharmila : "అవి గొడ్డలి"- జగన్ మావిగాన్ కు షర్మిల షాకింగ్ పంచ్..! -
పాదయాత్ర 2.0 పై మారిన జగన్ ఆలోచన, పార్టీ ప్లీనరీ అక్కడే..!! -
జగన్ పై అటాక్ కు కాదేదీ అనర్హం ? తండ్రి పాదయాత్రనూ వాడేస్తున్న షర్మిల..! -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల












Click it and Unblock the Notifications