వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోజా వ్యాఖ్యలపై జగన్ రివ్యూ: బీసీని ఎందుకు పెళ్లాడుతుందని చెవిరెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తాము ఎస్సీలమో, ఎస్టీలమో కాదని తమ పార్టీ శాసనసభ్యురాలు రోజా చేసినట్లు వినిపిస్తున్న వ్యాఖ్యలపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి శనివారంనాడు సమీక్షించారు. అందుబాటులో ఉన్న నాయకులతో ఆయన ఆ వ్యాఖ్యలపై చర్చలు జరిపారు. విజయసాయి రెడ్డి, జ్యోతుల నెహ్రూ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే రోజా ఎస్సీ, ఎస్టీలకు వ్యతిరేకం కాదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చెప్పారు. రోజాకు కులవివక్ష ఉంటే బీసీ వ్యక్తిని ఎందుకు పెళ్లి చేసుకుంటుందని ఆయన ప్రశ్నించారు. టీడీపీ నేతలు ప్రతి దాన్నీ రాజకీయం చేయడం సరికాదని ఆయన కోరారు.

YS Jagan

కాగా వైసీపీ ఎమ్మెల్యే రోజా ప్రవర్తన బాగోలేదని, తన హోదాకు తగినట్లు ప్రవర్తించడం లేదని రాష్ట్ర మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఆరోపించారు.

జగన్ సమీక్ష నిర్వహించిన తర్వాత రోజాను సమర్థిస్తూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు ఒక్కరొక్కరే ప్రకటనలు చేస్తున్నారు. ఇప్పటికే జ్యోతుల నెహ్రూ రోజాకు మద్దతుగా మాట్లాడారు. రోజా ఎస్సీ, ఎస్టీలకు వ్యతిరేకం కాదని వారు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

English summary
YSR Congress party president YS Jagan reviewd on Nagari MLA Roja's comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X