వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీపీఎస్ రద్దుపై సజ్జల కామెంట్స్- జగన్ ను ఇరికించారా ? బయటపడేశారా ?

|
Google Oneindia TeluguNews

ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ గతంలో పాదయాత్ర చేస్తున్న సందర్భంగా తనను కలిసిన ఉద్యోగులకు ఇబ్బందికరంగా మారిన సీపీఎస్ విధానాన్ని తాను అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో రద్దు చేస్తానంటూ హామీ ఇచ్చారు. దీంతో నమ్మిన ఉద్యోగులు ఆయనకు ఓటేశారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తవుతున్నా ఇప్పటికీ ఆ హామీ నెరవేరలేదు. దీనిపై ఉద్యోగులు భవిష్యత్ పోరుకు సిద్ధమవుతుండగా.. తాజాగా సీపీఎస్ రద్దుపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

జగన్ సీపీఎస్ రద్దు హామీ

జగన్ సీపీఎస్ రద్దు హామీ

ఏపీలో వైఎస్ జగన్ తన పాదయాత్ర సందర్భంగా ఉద్యోగులకు ఇచ్చిన హామీల్లో సీపీఎస్ రద్దు కూడా ఒకటి. అయితే సీపీఎస్ విధానం వల్ల ఎదురవుతున్న ఇబ్బందుల్ని ఉద్యోగుల నుంచి తెలుసుకున్న జగన్ తాను అధికారం చేపట్టగానే వారం రోజుల్లో దాన్ని రద్దు చేస్తానని అప్పట్లో హామీ ఇచ్చేశారు. దీంతో ఉద్యోగులు వైసీపీకి గంపగుత్తగా ఓట్లేశారు. కానీ అధికారంలోకి రాగానే సీపీఎస్ రద్దుపై ఉద్యోగులకు సర్దిచెప్పలేక, అలాగని హామీ అమలు చేయలేక జగన్ నానా ఇబ్బందులు పడుతున్నారు. కానీ రెండున్నరేళ్లుగా దీన్ని అమలు చేసి తీరుతామని చెప్తూ వచ్చారు. ఇప్పుడు ఉద్యోగుల నుంచి పోరు పెరిగే సరికి అసలు వాస్తవం బయటపెట్టేశారు.

తెలియక హామీ ఇచ్చిన జగన్

తెలియక హామీ ఇచ్చిన జగన్


పాదయాత్ర సందర్భంగా తనను కలిసిన ఉద్యోగులు సీపీఎస్ రద్దు చేయమని అడగ్గానే దానిలో ఉన్న సాంకేతిక విషయాలు తెలియకుండానే జగన్ హామీ ఇచ్చేశారు. ఈ విషయం ఇప్పుడు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి బయటపెట్టేశారు. సీపీఎస్ రద్దుకు జగన్ సాంకేతిక ఇబ్బందులు తెలియకుండానే హామీ ఇచ్చారని ఆయన చెప్పేశారు. దీంతో జగన్ ఇరుకునపడ్డారు. ఏ ప్రభుత్వం కానీ, ప్రభుత్వాధినేత కానీ పొరబాటున ఇలాంటి పనులు చేసినా దాన్ని కవర్ చేసేందుకే ప్రభుత్వాలు, అధికార పార్టీలు, నేతలు ప్రయత్నిస్తారు. కానీ సజ్జల మాత్రం ఈ విషయం ఇక దాచిపెట్టి లాభం లేదని భావించినట్లు కనిపిస్తోంది.

రాష్ట్ర బడ్డెట్ కూడా సరిపోదంటూ

రాష్ట్ర బడ్డెట్ కూడా సరిపోదంటూ


సీపీఎస్ విధానం రద్దు చేసి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ పరిధిలోకి ఉద్యోగుల్ని తీసుకురావాలంటే రాష్ట్ర బడ్జెట్ కూడా సరిపోదని సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తేల్చిచెప్పేశారు. దీంతో సీపీఎస్ రద్దుపై ఉద్యోగుల్లో ఉన్న చివరి ఆశలు కూడా అడుగంంటిపోయాయి. నిన్న మొన్నటి వరకూ సీపీఎస్ పై పోరాటం చేస్తామని చెప్పిన ఉద్యోగ సంఘాలు... ఇప్పుడు సజ్జల వ్యాఖ్యలతో ఏం చేయాలో తెలియని అయోమయ స్ధితిలో పడిపోయాయి. సాంకేతిక అంశాలు తెలియకుండా హామీ ఇచ్చామని, సీపీఎస్ రద్దు అసాధ్యమని ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి తేల్చిచెప్పేయడంతో ఇక ఉద్యోగులు చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్ధితులు నెలకొన్నాయి.

ఉద్యోగులతో జగన్ భేటీ వేళ

ఉద్యోగులతో జగన్ భేటీ వేళ

ఉద్యోగసంఘాలతో పీఆర్సీపై చర్చలు జరిపేందుకు సీఎం జగన్ నేరుగా రంగంలోకి దిగుతున్నారు. ఇలాంటి కీలక సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డి వారికి సీపీఎస్ రద్దు అసాధ్యమని చెప్పేశారు. దీంతో ఇప్పుడు పీఆర్సీతో పాటు సీపీఎస్ రద్దు డిమాండ్ పై సైతం ఉద్యోగులు ఏదో ఒకటి తేల్చుకోవాల్సిన పరిస్ధితి నెలకొంది. సజ్జల వ్యాఖ్యల తర్వాత ఉద్యోగులతో జరిగే భేటీలో జగన్ ఏం చెప్పబోతున్నారనేది కూడా ఉత్కంఠ రేపుతోంది. ఉద్యోగులతో బేటీలో జగన్ కూడా అదే మాట చెప్పేస్తే ఏం చేయాలన్న దానిపై ఉద్యోగ సంఘాలు ఇప్పటికే చర్చించుకుంటున్నాయి.

 సజ్జల జగన్ కు మేలు చేశారా ?

సజ్జల జగన్ కు మేలు చేశారా ?


రెండున్నరేళ్లుగా సీపీఎస్ విధానం రద్దు హామీపై వైసీపీ సర్కార్ ఉద్యోగుల నుంచి తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటోంది. పీఆర్సీ అమలు డిమాండ్ కు తోడు సీపీఎస్ రద్దు కూడా తోడవడంతో ఉద్యోగులు తాజాగా పోరాటం ప్రారంభించారు. ఇలాంటి సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డి సీపీఎస్ రద్దు సాధ్యం కాదని చెప్పేశారు. దీంతో వైసీపీ సర్కార్ పై ఉన్న భారం కాస్తా దిగిపోయింది. ఎలాగో ఇప్పట్లో ఎన్నికలు లేవు. సీపీఎస్ రద్దు కుదరదని చెప్పేసినా ఉద్యోగులు మరో రెండేళ్ల పాటు పోరాటం చేయకతప్పదు. ఆ తర్వాత పరిస్ధితులు ఎలా ఉంటాయో తెలియదు. దీంతో ఇప్పుడు సజ్జల అసలు విషయం చెప్పేయడం ద్వారా ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసినట్లయిందన్న వాదన వినిపిస్తోంది.

English summary
ap govt advisor sajjala ramakrishna reddy's recent comments on cps cancellation demand seems to create troubles for cm jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X