3 నుంచి జగన్ జనభేరి: హెచ్చరికల మధ్య టిలోనూ..
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించ తలపెట్టిన యాత్ర వైయస్సార్ జనభేరి షెడ్యూల్‌ను శుక్రవారం విడుదల చేశారు. మార్చి 1న చిత్తూరు జిల్లాలోని తిరుపతిలో వైయస్సార్ జనభేరి జరుగుతుందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం తెలిపారు.
శనివారం సాయంత్రం తిరుపతిలోని లీలామల్ సర్కిల్లో వైయస్ జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభ నిర్వహించనున్నారని ఆయన చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరులో మూడవ తేదీన, నిడదవోలులో నాల్గవ తేదీన నిర్వహించే భారీ బహిరంగ సభల్లో జగన్ పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు.

మార్చి 5న తెలంగాణ ప్రాంతంలోని ఖమ్మం జిల్లాలో జగన్మోహన్ రెడ్డి జనభేరిని నిర్వహిస్తారని తెలిపారు. మార్చి 6,7,8 తేదీల్లో గుంటూరు జిల్లాలో భారీ బహిరంగ సభల్లో జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారని తలశిల రఘురాం చెప్పారు.
మార్చి 6న నరసరావుపేటలో, 7,8 తేదీల్లో మాచర్ల నియోవర్గంలో జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర నిర్వహిస్తారని పేర్కొన్నాయి. మార్చి 9 నుంచి 14వ తేదీ వరకు నల్గొండ జిల్లాలో ఓదార్పు యాత్ర ఉంటుందని తెలిపారు. కాగా జగన్మోహన్ రెడ్డి తెలంగాణలో పర్యటిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని ఆ ప్రాంత నేతలు హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే. సమైక్యాంధ్రకు కట్టుబడి ఉంటామన్న నాయకుడు తెలంగాణలో ఎట్లా పర్యటిస్తారని తెలంగాణవాదులు మండిపడుతున్నారు.












Click it and Unblock the Notifications