వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మద్య నిషేదం చేస్తా కానీ, ధరలు బాగా పెంచుతా: జగన్ మెలిక

తాము అధికారంలోకి వచ్చాక మద్యాన్ని మూడు దశల్లో నిషేధిస్తానని వైసిపి అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: తాము అధికారంలోకి వచ్చాక మద్యాన్ని మూడు దశల్లో నిషేధిస్తానని వైసిపి అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు.

ఆదివారం ప్లీనరీ ముగింపు సందర్భంగా జగన్ మాట్లాడారు. తాను అధికారంలోకి వస్తే చంద్రబాబు నిర్లక్ష్యం చేసిన ఈ తొమ్మిదింటిని సరి చేస్తానని అభిప్రాయపడ్డారు. అందులో తొమ్మిదో అంశం మద్యం.

<strong>అన్నొస్తున్నాడని చెప్పండి.. : జగన్ ప్రకటన</strong>అన్నొస్తున్నాడని చెప్పండి.. : జగన్ ప్రకటన

మద్యాన్ని ఒక్క రోజులో నిషేధించలేమని చెప్పారు. కాబట్టి దశలవారిగా నిషేధిస్తామని ప్రకటించారు. మద్యం వల్ల ఎన్నో కుటుంబాలు నాశనమవుతున్నాయని, మానవ సంబంధాలు ధ్వంసమవుతున్నాయని జగన్ చెప్పారు. ఎన్నో కుటుంబాలు దిక్కులేనివిగా అవుతున్నాయన్నారు.

YS Jagan says three steps on liquor prohibition

మద్యం తాగేవాళ్లు భార్యా, తల్లిదండ్రులు, పిల్లల పట్ల ఆప్యాయత లేని వారు కాదని, తాగడం మానేస్తే తమ ఆర్థిక పరిస్థితి, ఆరోగ్యం బాగుపడుతుందని తెలియనంత అమాయకులు కాదన్నారు. కానీ జనావాసాల్లో మద్యం దుకాణాలను ప్రభుత్వమే పెడుతుందన్నారు.

ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మద్యాన్ని నిషేధించవచ్చునని చెప్పారు. గతంలో చాలామంది సిగరేట్ తాగేవారని, ఇప్పుడు సిగరేట్ తాగడం తగ్గిందని జగన్ చెప్పారు. అందుకు డేంజర్ గుర్తులను సిగరేట్ ప్యాకులపై వేయడం, పెద్ద ఎత్తున ప్రకటనలు ఇవ్వడం అన్నారు.

Recommended Video

TDP Senior Leader Shilpa Mohan Reddy Announced Date to Join YSRCP

మద్యాన్ని ఒకేసారి నిషేధిస్తే దానిని తాగేవారు వేరే మార్గాన్ని ఎంచుకుంటారని, కాబట్టి వారికి మాన్పించాలని, వారికి నష్టాలు తెలియచెప్పాలని, మద్యాన్ని నిషేధించే కార్యక్రమం తేవాలన్నారు. మూడు దశల్లో మద్యాన్ని నిషేధిస్తామన్నారు.

<strong>వైయస్ ఉంటే రాష్ట్రం విడిపోయేదా, నన్ను అబద్దమాడమన్నారు, 30 ఏళ్లు సీఎంగా నా ఆశ: జగన్</strong>వైయస్ ఉంటే రాష్ట్రం విడిపోయేదా, నన్ను అబద్దమాడమన్నారు, 30 ఏళ్లు సీఎంగా నా ఆశ: జగన్

మూడు దశల్లో ఇలా...

మొదటి దశలో మద్యం షాపులను తగ్గిస్తూ, బెల్టు షాపులపై ఉక్కుపాదం మోపుతామని చెప్పారు. నష్టాలను వివరిస్తామన్నారు. సినిమా, టీవీ మాధ్యమాలను ఉపయోగించుకుంటామన్నారు.

రెండోది.. మద్యం ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండకుండా ధరలు పెంచుకుంటూ పోతామన్నారు. మద్యమానాన్ని నిషేధించేలా కేంద్రాన్ని, ఇతర రాష్ట్రాలను, కోర్టులను ఒప్పించేలా అడుగు వేస్తామన్నారు. మద్యం మానుకునేందుకు ముందుకు వచ్చే వారికి కౌన్సెలింగ్ ఇప్పిస్తామని, వైద్యం చేయిస్తామని చెప్పారు.

మూడో దశలో మద్యాన్ని కోటీశ్వరులు మాత్రమే కొనుగోలు చేసేలా, ఫైవ్ స్టార్ హోటళ్లలో మాత్రమే లభించేలా చేస్తామన్నారు. కోటీశ్వరులకు మాత్రమే అందుబాటులో ఉండేలా చేసి, అనారోగ్యం వస్తే వారు అమెరికాకు వెళ్లి చికిత్స చేయించుకునేలా చేస్తామన్నారు. ఒక్క రోజులో మద్య నిషేదం సాధ్యం కాదని, అందుకే మూడు దశల్లో చేస్తున్నామని, అన్న చేసేది ఓ డాక్టర్ పని అని ప్రజలకు చెప్పండని జగన్ కార్యకర్తలకు సూచించారు.

English summary
YSR Congress Party chief YS Jaganmohan Reddy talk about three steps on liquor prohibition.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X