ఎన్నికలు: మరోసారి జగన్ సెంటిమెంట్ అస్త్రం.. ఆరోగ్యశ్రీ

హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కొత్త తరహా ప్రచారానికి తెరలేపిందంటున్నారు! సెంటిమెంటుతో ఓట్లను కొల్లగొట్టాలని ఆ పార్టీ చూస్తోంది! కాంగ్రెసు పార్టీ నుండి బయటకు వచ్చినప్పటి నుండి జగన్ సెంటిమెంటును అస్త్రంగా ప్రయోగిస్తున్నారనే విమర్శలు ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఎన్నికల నేపథ్యంలో రాజీవ్ ఆరోగ్యశ్రీని లబ్ధి కోసం ఉపయోగించుకుంటున్నారట.

ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్ చేయించుకున్న వారందరికీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ జగన్ సంతకంతో ఉత్తరాలు రాస్తోంది. జగన్ పార్టీకి ఓటేయాలంటూ ఉత్తరాలు రాస్తున్నారు. కడప, ఒంగోలులోని కొన్ని ప్రాంతాల ప్రజలకు ఇలా ఇప్పటివరకు ఉత్తరాలు అందాయి. లబ్ది పొందిన వారి పేరుతో వారి కుటుంబం పదికాలాలు పచ్చగా ఉండాలని కోరుకుంటూ అని సాగే ఆ ఉత్తరంలో వైయస్ హయాంలో చేపట్టిన, ప్రజలకు అందించిన పథకాలను, ఫలాలను ప్రస్తావించారు.

YS Jagan sentiment arm

ఫీజు రీయింబర్స్‌మెంటు, ఆరోగ్యశ్రీ, పంటరుణాల మాఫీ, పెన్షన్ల పెంపు వంటి ఫలాలు దక్కాలంటే, స్వర్ణయుగం రావాలంటే వైయస్సార్ కాంగ్రెసు పార్టీని గెలిపించాలని కోరుతున్నారు. మార్చి 31న జగన్ పార్టీ గుర్తు, వైయస్, జగన్ ఫొటోతో హైదరాబాద్ నుంచి ఈ ఉత్తరం పోస్టయింది. కాగా, ఇది నిబంధనలకు విరుద్ధమని, ఆ పార్టీ నేతలపై తగు చర్యలు తీసుకోవాలని పలువురు ఈసీని కోరుతున్నారు.

జగన్ పైన గెలుస్తా: సతీష్ రెడ్డి

పులివెందులలో జగన్‌పై విజయం సాధిస్తానని టిడిపి అభ్యర్థి సతీష్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. పులివెందులలో 1999 నుంచి సతీష్ వరుసగా పోటీ చేస్తున్నారు. జగన్ బలహీన అభ్యర్థి అని సతీష్ వ్యాఖ్యానించారు. 'గత మూడున్నర నాలుగేళ్ల నుంచి పులివెందులలో ఏమైనా అభివృద్ధి జరిగిందా? అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+