ఉన్నపళంగా ఆ రెండింటిపై జగన్ స్పెషల్ ఫోకస్
ఏపీకి సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఆధిపత్యం చాటుకునేందుకు రాజకీయ పార్టీలన్నీ వ్యూహ ప్రతివ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి వైసీపీకి పులివెందుల నియోజకవర్గంతోపాటు కడప లోక్ సభ నియోజకవర్గం గురించి ప్రత్యేకంగా ఆందోళన చెందాల్సిన అవసరంలేదు. ఎందుకంటే ఆ నియోజకవర్గాల్లో ఓట్లు వైఎస్ కుటుంబాన్ని కాదని ఇతర పార్టీలకు ఓటువేయరు. ఇటువంటి తరుణంలో వైఎస్ జగన్ హఠాత్తుగా పులివెందులు, కడప స్థానాలపై దృష్టిసారించారు.
పులివెందులలో పార్టీ పరిస్థితి ఏమిటి? కడప లోక్ సభ పరిధిలో ఎలా ఉంది? అంటూ నాయకులతో మాట్లాడుతున్నారు. ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే వాటిని సరిచేయడానికి సూచనలు జారీచేస్తున్నారు. ఈ రెండు నియోజకవర్గాలకన్నా ముఖ్యమంత్రి జగన్ కుప్పం, పిఠాపురం పైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు. దీంతో కడప, పులివెందులపై నిర్లక్ష్యం చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. దీనికితోడు ఈ రెండు నియోజకవర్గాల్లో మారుతున్న రాజకీయ పరిణామాలు కూడా ఆ పార్టీని కలవరపెట్టాయి.

వైఎస్ కుటుంబంలో చీలిక రావడం.. సోదరి షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఉండటంతోపాటు వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత బహిరంగంగా ప్రకటనలివ్వడం, వైఎస్ విజయమ్మ ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండటం లాంటి పరిణామాలు సంభవించాయి. వివేకా కుటుంబం వైసీపీకి వ్యతిరేకంగా పనిచేస్తోంది. ఆ ప్రభావంవల్ల ఓట్ల చీలిక వస్తుందని భావిస్తున్నారు. దీంతో కడప లోక్ సభ, పులివెందులపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఎటువంటి విభేదాలు లేకుండా అందరూ కలిసి పనిచేసుకుందామని వైసీపీ నాయకులు చెబుతున్నప్పటికీ దివంగత వైఎస్ కుటుంబానికి చెందినవారంతా ఇప్పటికే విడిపోయివున్నారు. భవిష్యత్తులో ఎంతమేరకు కలిసి పనిచేస్తారో చూడాలి.












Click it and Unblock the Notifications