చంద్రబాబుకు భయం వెనుక, నెక్స్ట్ జరిగేది ఇదే - జగన్..!!
మాజీ ముఖ్యమంత్రి జగన్ నెల్లూరులో పర్యటించారు. సీఎం చంద్రబాబు లక్ష్యంగా కీలక వ్యాఖ్యలు చేసారు. తన పర్యటనల పైన ఆంక్షలు పెట్టటాన్ని ప్రశ్నించారు. జైలులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పరామర్శించారు. మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకున్నాయని విమర్శించారు. తన పర్యటనలు అంటే చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. తన పాలనలో వైఫల్యాలను ప్రశ్నిస్తారనే భయం చంద్రబాబు లో ఉందని చెప్పుకొచ్చారు. మరో మూడేళ్లలో వైసీపీ అధికారంలోకి రావటం ఖాయం అని జగన్ ధీమా వ్యక్తం చేసారు.
మాజీ సీఎం జగన్ నెల్లూరు పర్యటన ఉత్కంఠ నడుమ సాగింది. జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న కాకాణి గోవర్ధన్ రెడ్డితో జగన్ ములాఖత్ అయ్యారు. ఆ తరువాత మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ప్రసన్న తో పాటుగా ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రసన్న ఇంటి పైన జరిగిన దాడిని ఖండించారు. దాడి సమయంలో ప్రసన్న ఇంటిలో ఉండి ఉంటే ఏం జరిగేదో అని ఆందోళన వ్యక్తం చేసారు. రాజకీయాల్లో విమర్శలు.. ప్రతి విమర్శలు సహజమని.. దాడులు చేయటం ఏంటని ప్రశ్నించారు. మారణాయుధాలతో ప్రసన్న ఇంటి పైన దాడి చేసారని చెప్పుకొచ్చారు. ప్రసన్న ఇంటిలో ఉండి ఉంటే చంపేసి ఉండేవారని జగన్ వ్యాఖ్యానించారు. మనిషి నచ్చకపోతే చంపేస్తారా అని నిలదీసారు.

ఏ తప్పు చేశాడని కాకాణిని జైలులో పెట్టారని జగన్ ప్రశ్నించారు. కాకాణి పై ఏకంగా 14 కేసులు పెట్టారని చెప్పుకొచ్చారు. 64 రోజులుగా కాకాణి జైలులో ఉన్నారని వవరించారు. వైసీపీ నేతలను లక్ష్యంగా చేసుకొని వేధిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఉచిత ఇసుక ఎక్కడ ఇస్తున్నారని జగన్ ప్రశ్నించారు. వైసీపీ హయాం కంటే రెట్టింపు ధరకు ఇసుక అమ్ముతున్నారని విమర్శించారు. తప్పుడు సంప్రదాయానికి చంద్రబాబు బీజం నాటారని పేర్కొన్నారు. తప్పుడు కేసులు పెట్టిన వారందరీ లెక్కలు తీస్తామని.. సప్త సముద్రాల అవతల ఉన్నా వదలిపెట్టమని జగన్ నెల్లూరులో హెచ్చరించారు. వడ్డీతో సహా తిరిగి ఇవ్వటం ఖాయమని చెప్పారు. భవిష్యత్ లో చోటు చేసుకునే పరిణామాలకు చంద్రబాబుదే బాధ్యత అని జగన్ తేల్చి చెప్పారు.
తన పర్యటనల సమయంలో ఆంక్షలు ఎందుకని జగన్ ప్రశ్నించారు. జనం రాకుండా ఏకంగా రోడ్లనే తవ్వేశారని చెప్పారు. తన పర్యటనలంటే చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని జగన్ వ్యాఖ్యానించారు. హామీలు అమలు కావటం లేదని... వైసీపీ ప్రతిష్ఠాత్మకంగా అమలు చేసిన పథకాలను నిర్వీర్యం చేసారని ఆరోపించారు. రైతులను ముంచేసారని విమర్శించారు. ప్రశ్నించే వారి గొంతు నొక్కి దాడులు చేస్తున్నారని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications