అమరావతిలో ప్రధాని సభకు జగన్ వచ్చి ఉంటే..!!
అమరావతి సభ వేదిక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రధాని మోదీ అమరావతి పనుల రీ లాంఛ్ తో పాటుగా పలు కార్యక్రమాలకు శంకుస్థాపన చేసారు. అమరావతికి కేంద్రం పూర్తి స్థాయి లో సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. చంద్రబాబు - పవన్ పైన కీలక వ్యాఖ్యలు చేసారు. కాగా, ఈ సభకు పలువురు ప్రముఖులను ప్రభుత్వం ఆహ్వానించింది. మాజీ సీఎం జగన్ ను సైతం ఆహ్వానించినా.. హాజరు కాలేదు. జగన్ ఈ సభకు వచ్చి ఉంటే.. ఏం జరిగేదో టీడీపీ మంత్రులే స్వయంగా చెబుతున్నారు. ఇంతకీ ఏం జరిగేది..
జగన్ ను ఆహ్వానించినా
అమరావతి సభకు మాజీ ముఖ్యమంత్రి జగన్ ను ఆహ్వానించారు. జగన్ సభకు ముందు రోజునే బెంగళూరుకు వెళ్లిపోయారు. జగన్ ను సభకు రావాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం మేరకు ప్రోటో కాల్ అధికారులు తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లి ఆహ్వాన పత్రిక ఇచ్చారు. జగన్ అందుబాటు లో లేకపోవటంతో ఆయన వ్యక్తిగత కార్యదర్శికి ఆహ్వానం అంద చేసారు. అమరావతి రాజధాని పైన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. మూడు రాజధానుల్లో ఒకటిగా అమరావతిని పేర్కొన్నారు. అయితే, 2024 ఎన్నికల్లో జగన్ నిర్ణయాలక వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతి పనులను తిరిగి ప్రారంభించారు.

జగన్ వచ్చి ఉంటే
ఇక, అమరావతి పనుల రీ లాంఛ్ వేళ జగన్ ను సైతం ప్రభుత్వం ప్రధాని సభకు రావాలని ఆహ్వానం పంపింది. దీంతో, ఇక అమరావతి రాజధానిగా కొనసాగటం ఖాయమైంది. ఇందు కోసం అనుమానాలకు అవకాశం లేకుండా చట్టబద్దత అంశం పైనా చర్చ జరుగుతోంది. 2024 ఫలితాల తరువాత జగన్ కు అమరావతి గురించి తన పైన వ్యతిరేకత పోగొట్టుకోవటానికి ఈ సభకు వెళ్లి ఉండాల్సిందనే అభిప్రాయం వైసీపీ నేతల్లోనూ వ్యక్తమైంది. ఇక అమరావతే రాజధానిగా అందరూ భావిస్తున్న వేళ.. ఈ సభకు జగన్ హాజరు అయి ఉంటే.. గతంలో పడిన వ్యతిరేక ముద్ర తొలిగి.. రానున్న రోజుల్లో రాజకీయంగానూ కలిసి వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే, కూటమి నేతలు రాజకీయ ఎత్తుగడలో భాగంగానే జగన్ ను ఆహ్వానించారనేది వైసీపీ నేతల్లో మరో అభిప్రాయం గా ఉంది.
ఛాన్స్ మిస్
జగన్ అమరావతి సభకు రాకపోవటం పైన మంత్రి భరత్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. రాజధాని అమరావతి పనులు వెంటనే మొదలవుతాయని చెప్పారు. రాజధాని పనులకు ఇప్పటికే టెండర్లు పూర్తయ్యాయన్నారు. ప్రధాని మోదీ ప్రారంభించడంతో పనులు రేపటి నుంచే మొదలవుతాయని చెప్పారు. ప్రధాని సభకు వైఎస్ జగన్ వచ్చి ఉంటే.. అమరావతి నిర్మాణంలో భాగస్వాములయ్యే వారని అభిప్రాయపడ్డారు. రాజధాని విషయంలో ఆయన గతంలో చేసిన తప్పులు సరిదిద్దుకునే అవకాశం ఉండేదని మంత్రి భరత్ వ్యాఖ్యానించారు. మరి, జగన్ సభకు హాజరు కాకపోవటంతో ఆయన ఆ ఛాన్స్ మిస్ చేసుకున్నారా.. లేక, జగన్ నిర్ణయమే సరైనదా అనే విషయంలో భిన్నాభి ప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications