రాత్రికి రాత్రే కల్తీ మద్యం సూత్రధారుల మార్పు - జగన్ సంచలనం..!!

ఏపీలో లిక్కర్ కేంద్రంగా రాజకీయం నడుస్తోంది. వైసీపీ హయాంలో లిక్కర్ కుంభకోణం జరిగిందని విచారణ చేస్తున్న సిట్ పలువురు నేతలను అరెస్ట్ చేసింది. కొందరు నేతలు బెయిల్ పై బయటకు వచ్చారు. కాగా, తాజాగా అన్నమయ్య జిల్లా ములకలచెరువులో కల్తీ లిక్కర్ డెన్ బయట పడింది. ఈ వ్యవహారం వెనుక టీడీపీ నేతలు ఉన్నారని వైసీపీ ఆరోపిస్తోంది. ఇక.. మాజీ సీఎం జగన్ ఇదే అంశం పైన సీఎం చంద్రబాబును టార్గెట్ చేసారు. పలు విమర్శలు గుప్పించారు.

మాజీ సీఎం జగన్ తాజాగా అన్నమయ్య జిల్లాలో బయట పడిన కల్తీ మద్యం డెన్ పైన స్పందించారు. సోషల్ మీడియా వేదికగా సీఎం చంద్రబాబు పైన విమర్శలు చేసారు. అందులో.. చంద్రబాబు గారూ.. మద్యానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారిన మీరు, ఇప్పుడు నకిలీ లిక్కర్‌ వ్యవహారంలోనూ రాష్ట్రాన్ని నంబర్‌ వన్‌గా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నట్టున్నారని విమర్శించారు. అన్నమయ్య జిల్లా ములకలచెరువులో మీ పార్టీ నాయకులు ఏకంగా కల్తీ మద్యం తయారీ ఫ్యాక్టరీయే పెట్టి సప్లై చేసిన ఘటన రాష్ట్రంలో మద్యం అక్రమాలకు నిదర్శనంగా నిలుస్తోందని అన్నారు. రాష్ట్రానికి సంపద పెరగడం సంగతేమోకాని, లిక్కర్‌ సిండికేట్లతో, నకిలీ మద్యం తయారీల ద్వారా, ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి మీ పార్టీ నాయకులు గడించిన అక్రమ సంపాదనను పైనుంచి కిందివరకూ వీరంతా పంచుకుంటున్నారని విమర్శించారు.

ys-jagan-slams-cm-chandra-babu-over-adultered-liquor-den-busted-in-mulakalacheruvu

ఈ వ్యవహారం వ్యవస్థీకృతంగా ఈ దందా కొనసాగుతోందని ఆరోపించారు. మీ లిక్కర్‌ సిండికేట్లకు, గ్రామస్థాయి వరకూ విస్తరించిన బెల్టుషాపుల మాఫియాలకు, కల్తీ మద్యం వ్యాపారానికి అడ్డురాకూడదనే ఉద్దేశంతోనే ఒక వ్యూహం ప్రకారం మీరు ప్రభుత్వ మద్యం దుకాణాలపై విష ప్రచారం చేశారని వైఎస్‌ జగన్‌ అన్నారు. ఉద్దేశపూర్వకంగా వాటిని తీసివేసి, వాటి స్థానంలో మీ సిండికేట్లకు అప్పగించారని అన్నారు. మద్యం దుకాణాలు టీడీపీ వాళ్లవే అని ఆరోపించారు. బెల్టుషాపులు టీడీపీ వాళ్లవే అని పేర్కొన్నారు. ఇల్లీగల్‌ పర్మిట్‌ రూమ్‌లు టీడీపీ వాళ్లవే అని ఆరోపించారు. అక్రమ మద్యం తయారీ దారులు కూడా టీడీపీ నేతలే అని.. వాళ్లు తయారు చేస్తారు, ఆ తయారు చేసిన దాన్ని మీ వాళ్లే, మీ షాపులద్వారా, మీ బెల్టుషాపుల ద్వారా అమ్ముతారని విమర్శించారు. అలా వచ్చిన డబ్బును వాటాలు వేసుకుని పంచుకుంటారన్నారు. రాష్ట్రంలో ప్రతి మూడు బాటిళ్లలో ఒకటి కల్తీ మద్యమేనని మండిపడ్డారు.

https://twitter.com/ysjagan/status/1974717372960293370

మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ మద్యం దుకాణాలను రద్దుచేసి విచ్చలవిడిగా మద్యం విక్రయాలను పెంచారని అన్నారు. మార్ట్‌లు పెట్టారు, తిరిగి మళ్లీ ఇల్లీగల్‌ బెల్టుషాపులు తెరిచారు, ప్రతి వీధిలోనూ పెట్టారు, రాత్రిపగలు తేడాలేకుండా లిక్కర్‌ అమ్మడం మొదలు పెట్టారని విమర్శించారు. ఇల్లీగల్‌ పర్మిట్‌ రూమ్‌లు తెరిచారని మండిపడ్డారు. ఇంత విచ్చలవిడిగా తాగిస్తున్నా సరే, కాగ్ నివేదికల ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొదటి ఐదు నెలల్లో, అంటే ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారానే లిక్కర్‌ అమ్మకాలు ఉన్నప్పుడు రాష్ట్ర ఎక్సైజ్‌ ఆదాయం ₹6,782.21 కోట్లు కాగా, 2025-26 ఆర్థిక సంవత్సరంలోని మొదటి ఐదు నెలల్లో, విచ్చలవిడిగా లిక్కర్‌ అమ్మినా సరే ఆదాయం ₹6,992.77 కోట్లు మాత్రమే వచ్చిందని అన్నారు.. కేవలం 3.10% వృద్ధి మాత్రమే ఉందన్నారు. టీడీపీ ఇన్‌ఛార్జి కనుసన్నల్లో ఈ కల్తీమద్యాన్ని తయారు చేస్తే, వీరిని తప్పిస్తూ తూతూమంత్రంగా కేసు నమోదు చేశారన్నారు. అసలు సూత్రధారులను కాపాడేలా స్కెచ్‌ వేసి, మీరు ఇచ్చిన ఆదేశాల మేరకు, మీ కార్యాలయ డైరెక్షన్‌లో రాత్రికి రాత్రే కేసు మార్చేశారని జగన్ తన ట్వీట్ లో ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+