ఇబ్బందులు నిజమే: జగన్‌పై నిప్పులు చెరిగిన యనమల, రాజధానికి సాయం
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు మంగళవారం నాడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు మంగళవారం నాడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్ రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతున్నారని ఆరోపించారు.
తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరంలో తెలుగుదేశం పార్టీ జన చైతన్య యాత్రలో మంత్రులు యనమల రామకృష్ణుడు, చినరాజప్ప పాల్గొన్నారు. ఈ సందర్భంగా యనమల మాట్లాడారు. వివిధ సామాజిక వర్గాలకు చెందిన వారు కులధ్రువీకరణ పత్రాలను పొందే విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.

ఆ సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని చెప్పారు. టిడిపి అధికారం చేపట్టిన రెండున్నర సంవత్సరాల్లో ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందని హోంమంత్రి చినరాజప్ప చెప్పారు.
రాజధానికి సాయం
ఏపీ రాజధాని అమరవతి నిర్మాణానికి కేంద్రం, ప్రపంచ బ్యాంకు, హడ్కో కలిసి సాయం చేసేందుకు అంగీకరించాయి. ఈ మేరకు రూ.14,500 కోట్ల నిధులు ఇచ్చేందుకు నిర్ణయించుకున్నాయి. ఇప్పటికే సాయానికి సంబంధించిన లేఖలు సీర్డీఏకు అందాయి.












Click it and Unblock the Notifications