జైలుకెళ్లడం ఎంతో బాధ: జగన్, కేసులు నన్నేం చేయవ్: చంద్రబాబు

జైలుకు వెళ్లడం ఎంత బాధాకరమో తనకు తెలుసునని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం నాడు వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది.

అమరావతి: జైలుకు వెళ్లడం ఎంత బాధాకరమో తనకు తెలుసునని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం నాడు వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది.

నిర్ధారణ లేకుండా 16 నెలలు తనను జైలులో ఉంచారని జగన్ విమర్శించారు. కేసుపై విచారణ పేరుతో మూడు నెలల కంటే ఎక్కువ జైలులో పెట్టడానికి లేదని చెప్పారు. కాంగ్రెస్, టిడిపిలు కుమ్మక్కై తనను జైలుకు పంపించారని ఆరోపించారు.

కేసులు నన్నేం చేయలేవు: చంద్రబాబు

తనపై వేస్తున్న కేసుల గురించి ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. వాటి గురించి తాను పట్టించుకోనని చెప్పారు. ఎలాంటి తప్పు చేయనందున తాను భయపడేది లేదన్నారు.

YS Jagan talks about jail life and Chandrababu on cases

గతంలో తనపై 26 కేసులు వేసినా ఏమీ చేయలేరని చెప్పారు. ఇంకా తనకు వ్యతిరేకంగా కేసులు వేస్తూనే ఉన్నారని, ఎన్ని కేసులు వేసినా భయపడేది లేదన్నారు. కొన్ని కేసులు తనపై వేస్తే 2012లో తేలిందన్నారు. తనపై కేసులు వేస్తే ఏమయిందని, ఏమీ కాలేదన్నారు.

కాగా, ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబును ప్రాసిక్యూషన్‌ చేసేలా ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ కేసులో చంద్రబాబును ప్రాసిక్యూట్‌ చేయాలా.. వద్దా అన్న అంశంపై పూర్తిస్థాయిలో వాదనలు వింటామని జస్టిస్‌ బూబ్డే, జస్టిస్‌ లావు నాగేశ్వరరావులతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.

ఈ పిటిషన్‌ను వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి దాఖలు చేశారు. గతంలో ఈ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయగా దానిని సవాల్‌ చేస్తూ ఆళ్ల రామకృష్ణా రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+